UAE Floods: యూఏఈలో భారీ వర్షాలు.. ఏడుగురు మృతి

భారీ వర్షాలకు యూఏఈ అతలాకుతలమవుతోంది. పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. నివాస ప్రాంతాలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. వరదల ప్రభావంతో ఇప్పటివరకు ఏడుగురు మరణించినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.

UAE Floods: యూఏఈలో భారీ వర్షాలు.. ఏడుగురు మృతి

Uae Floods

Updated On : July 30, 2022 / 2:44 PM IST

UAE Floods: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఆకస్మిక వరదల కారణంగా వాహనాలు కొట్టుకుపోతున్నాయి. రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. షాపులతోపాటు, ఇండ్లను కూడా వరద నీరు ముంచెత్తింది.

Monkeypox: స్పెయిన్‌లో మంకీపాక్స్‌ రోగి మృతి

యూఏఈ వార్షిక సగటు వర్షపాతంకంటే రెట్టింపు వర్షపాతం ఇప్పటికే నమోదైంది. ఫ్యుజైరా ప్రాంతంలో సోమ, మంగళవారాల్లో అత్యధికంగా 234.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పన్నెండు గంటల్లోనే ఈ వర్షపాతం నమోదు కావడం విశేషం. ఇక్కడ గత 27 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వర్షపాతం నమోదైనట్లు అక్కడి వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది రాతి ఎడారి ప్రాంతం. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు, సైన్యం రంగంలోకి దిగింది. వరదల్లో చిక్కుకుపోయిన నాలుగు వేల మందిని రక్షించి, పునరావాస కేంద్రాలకు తరలించారు.

New Excise Policy: ఆప్ ప్రభుత్వం యూ టర్న్.. పాత పద్ధతిలోనే మద్యం విక్రయాలకు నిర్ణయం

వర్షాల ప్రభావంతో పర్వతాల దిగువన ఉన్న గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. అయితే, దుబాయ్, అబుదాబీ నగరాల్లో మాత్రం తక్కువ వర్షపాతమే కురిసింది. మరోవైపు యూఏఈ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించింది. ఇప్పటివరకు ఆసియాకు చెందిన ఏడుగురు పౌరులు మరణించినట్లు వెల్లడించింది.