New Excise Policy: ఆప్ ప్రభుత్వం యూ టర్న్.. పాత పద్ధతిలోనే మద్యం విక్రయాలకు నిర్ణయం

ఢిల్లీలో ఇకపై పాత విధానంలోనే మద్యం విక్రయాలు జరగనున్నాయి. కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేస్తూ ఆప్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ప్రభుత్వ మద్యం షాపుల్లోనే మద్యం అమ్ముతారు.

New Excise Policy: ఆప్ ప్రభుత్వం యూ టర్న్.. పాత పద్ధతిలోనే మద్యం విక్రయాలకు నిర్ణయం

New Excise Policy

New Excise Policy: నూతన మద్యం పాలసీ విధానంపై ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. కొత్త మద్యం పాలసీని రద్దు చేస్తూ, పాత పద్ధతి ప్రకారమే మద్యం విక్రయాలు జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆగష్టు 1 నుంచి పాత పద్ధతిలోనే మద్యం విక్రయాలు జరుగుతాయని ఢిల్లీ ఎక్సైజ్ శాఖా మంత్రి మనీష్ సిసోడియా శనివారం ప్రకటించారు.

Karnataka: వింత సంప్రదాయం… మరణించిన వారికి 30 ఏళ్ల తర్వాత పెళ్లి!

తాజా నిర్ణయం ప్రకారం ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం షాపుల్లోనే మద్యం అమ్ముతారు. ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మద్యం పాలసీపై సీబీఐతో విచారణ జరిపించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించిన కొద్ది రోజులకే ఆప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ తాజా నిర్ణయంపై మనీష్ సిసోడియా శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘మద్యం విక్రయదారుల్ని ఈడీ, సీబీఐతో కేంద్రం బెదిరించాలనుకుంటోంది. అందుకే కొత్త మద్యం పాలసీ విఫలమైంది. బీజేపీ ఢిల్లీలో మద్యం కొరత ఏర్పడాలని చూస్తోంది. దీనివల్ల అక్రమ మద్యం అమ్ముకోవచ్చని భావిస్తోంది. గుజరాత్‌లో అక్రమ మద్యం అమ్ముతున్నట్లుగానే, ఇక్కడ కూడా అమ్మాలనుకుంటున్నారు.

Arpita Mukherjee: నోట్ల కట్టల మధ్య అర్పిత.. పాత ఇంట్లో నివసిస్తున్న తల్లి

మేం దాన్ని అమలుచేయనివ్వం. త్వరలో కొత్త మద్యం పాలసీని రూపొందిస్తాం. అప్పటివరకు పాత విధానమే అమలవుతుంది’’ అని మనీష్ సిసోడియా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీ పరిధిలో 468 ప్రభుత్వ మద్యం షాపులున్నాయి. వాటి ద్వారానే ఇకపై మద్యం విక్రయిస్తారు.