Arpita Mukherjee: నోట్ల కట్టల మధ్య అర్పిత.. పాత ఇంట్లో నివసిస్తున్న తల్లి

బెంగాలీ నటి అర్పితా ముఖర్జీ కోల్‌కతాలోని ఖరీదైన ఫ్లాట్లలో నివసిస్తుంటే.. ఆమె తల్లి మినాటీ ముఖర్జీ మాత్రం పాత ఇంటిలోనే జీవిస్తున్నారు. దాదాపు యాభై ఏళ్ల క్రితంనాటి పూర్వీకుల ఇంట్లోనే ఆమె ఉంటున్నారు.

Arpita Mukherjee: నోట్ల కట్టల మధ్య అర్పిత.. పాత ఇంట్లో నివసిస్తున్న తల్లి

Arpita Mukherjee

Arpita Mukherjee: బెంగాలీ నటి అర్పితా ముఖర్జీకి చెందిన రెండు ఇళ్లలో ఇటీవల దాదాపు రూ.50 కోట్ల నగదు బయటపడ్డ సంగతి తెలిసిందే. టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కాంలో మాజీ మంత్రి పార్థా ఛటర్జీకి సన్నిహితురాలని తేలడంతో ఆమె ఇంటిపై ఈడీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లోనే నగదు, బంగారం దొరికింది. అయితే.. అర్పిత ఇంత ఖరీదైన ఫ్లాట్లలో నోట్ల కట్టల మధ్య జీవిస్తుంటే.. ఆమె తల్లి మాత్రం తమ పాత ఇంట్లోనే ఉంటోంది.

Monkeypox: స్పెయిన్‌లో మంకీపాక్స్‌ రోగి మృతి

అర్పిత తల్లి మినాటి ముఖర్జీ.. కోల్‌కతాలో ఉన్న బెల్గోరియా ప్రాంతంలోని ఒక 50 సంవత్సరాల క్రితం నాటి ఇంట్లోనే ఉంటున్నారు. చాలా సాధారణమైన జీవితం గడుపుతున్నారు. అర్పిత తండ్రి లేకపోవడంతో, తల్లి ఒక్కరే ఆ పాత ఇంట్లో ఉంటున్నారు. అప్పుడప్పుడూ తన కూతురు ఆ ఇంటికి వస్తుంటుందని మినాటీ ముఖర్జీ తెలిపారు. అయితే ఎక్కువ సేపు ఇంట్లో ఉండదని, తన సొంత ఫ్లాట్‌కే వెళ్లిపోతుందని ఆమె చెప్పారు. అయితే, అర్పిత తనను బాగానే చూసుకుంటున్నట్లు మినాటి చెబుతోంది. తన ఇంట్లో పనిచేసేందుకు ఇద్దరు మనుషుల్ని కూడా నియమించినట్లు మినాటి ముఖర్జీ తెలిపారు. కాగా, అర్పిత అరెస్టు గురించి తల్లి మాట్లాడారు ‘‘అర్పిత నా మాటలు వినుంటే ఇప్పటికే పెళ్లి చేసేదాన్ని.

Mumbai: ఎలుకల మందు కలిపిన టమాటాలతో వండిన మ్యాగీ తిని మహిళ మృతి

ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగానే చనిపోయారు. ఆ ఉద్యోగం తనకూ వచ్చేది. కానీ, అర్పితకు ఉద్యోగంపై ఆసక్తి లేదు. తను చాలా కాలం క్రితమే ఇంటికి దూరంగా వెళ్లిపోయింది. అర్పిత అరెస్టు గురించి మీడియా ద్వారా తెలిసింది. అయితే, తన ఇంట్లో దొరికిన డబ్బు గురించి నాకేం తెలీదు. అవన్నీ చట్టపరమైన అంశాలు. దీని గురించి అర్పితను అడగటానికి ప్రయత్నిస్తా’’ అని మినాటీ ముఖర్జీ తెలిపారు. ప్రస్తుతం అర్పితా ముఖర్జీ ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.