Monkeypox: స్పెయిన్‌లో మంకీపాక్స్‌ రోగి మృతి

మంకీపాక్స్ ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా మంకీపాక్స్ రోగి ప్రాణాలు కోల్పోయాడు. స్పెయిన్‌లో ఒక మంకీపాక్స్ రోగి శుక్రవారం మరణించినట్లు అధికారులు తెలిపారు.

Monkeypox: స్పెయిన్‌లో మంకీపాక్స్‌ రోగి మృతి

Monkeypox

Monkeypox: ప్రపంచంలో అత్యధిక మంకీపాక్స్ కేసులు నమోదవుతున్న దేశాల్లో స్పెయిన్ ఒకటి. తాజాగా స్పెయిన్‌లో మంకీపాక్స్‌ లక్షణాలతో ఒక రోగి మరణించాడు. ఈ విషయాన్ని స్పెయిన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంకీపాక్స్ సోకిన రోగి శుక్రవారం మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

Cop kicks elderly man: వృద్ధుడిని తన్ని తలకిందులుగా వేలాడదీసిన కానిస్టేబుల్.. వీడియో వైరల్

మంకీపాక్స్‌కు సంబంధించి అనేక లక్షణాలు ఉంటాయి కాబట్టి, ఏ కారణంతో రోగి మరణించాడో కనుక్కోవాల్సి ఉందన్నారు. మృతుడి పోస్టుమార్టమ్ నివేదిక వచ్చిన తర్వాతే రోగి మరణానికి ‌అసలు కారణం తెలుస్తుంది. స్పెయిన్‌తోపాటు అనేక యూరప్ దేశాల్లో మంకీపాక్స్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. స్పెయిన్‌లో ఇప్పటివరకు 4,298 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 3,750 రోగులకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది. ఈ రోగుల్లో 120 మంది తీవ్రమైన లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు.

Minister KTR: బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్‌పై కేటీఆర్ ఆగ్రహం.. సస్పెండ్‌కు ఆదేశాలు.. కారణమేమంటే?

అంటే 3.2 శాతం మంది రోగులు ఆస్పత్రి పాలవ్వాల్సి వచ్చింది. మంకీపాక్స్ విజృంభిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. దీనిపై గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. మంకీపాక్స్ ప్రాణాంతకమైనది కాకపోయినప్పటికీ, వ్యాధి తీవ్రతను బట్టి, ఇతర అనారోగ్య కారణాలతో రోగి మరణించే అవకాశం ఉంది.