IT Return: ఆదాయపు పన్ను రిటర్న్ గడువు పొడిగింపు లేనట్లేనా?

ఆదాయపు పన్ను రిటర్న్ చెల్లించేందుకు రేపే చివరి రోజు. దీంతో చాలా మంది హడావుడిగా పన్ను చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకొందరు ప్రభుత్వం గడువు పొడిగిస్తుందని ఎదురు చూస్తున్నారు.

IT Return: ఆదాయపు పన్ను రిటర్న్ గడువు పొడిగింపు లేనట్లేనా?

It Return

IT Return: ఆదాయపు పన్ను రిటర్న్ గడువు ఆదివారం (జూలై 31)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువు తేదీని పెంచుతారని చాలా మంది భావిస్తున్నారు. దీనికోసం సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్ గడువు పెంచాలంటూ కొద్ది రోజులుగా ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి గడువు తేదీ పొడిగించే ఉద్దేశం లేదని, జూలై 31 చివరి తేదీ అని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ స్పష్టం చేసింది.

Monkeypox: స్పెయిన్‌లో మంకీపాక్స్‌ రోగి మృతి

గత రెండేళ్లుగా రిటర్న్ గడువును కోవిడ్ కారణంగా ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. 2020-21 సంవత్సరానికిగాను ఆదాయపు పన్ను చెల్లించేందుకు గడువు తేదీని ఐటీ శాఖ పొడిగించింది. 2021 డిసెంబర్ 31 చివరి తేదీగా నిర్ణయించింది. దీంతో ఈ సారి కూడా గడువు తేదీ పొడిగిస్తారని చాలా మంది భావించారు. దీంతో ఇంకా చాలామంది ఇప్పటికీ చెల్లింపుల ప్రక్రియ మొదలుపెట్టలేదు. అయితే, ఈసారి గడువు పెంచే ఉద్దేశం లేదని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. ఐటీ శాఖ కూడా అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా దీనిపై స్పష్టతనిచ్చింది. ఫైన్ లేకుండా ఉండాలంటే జూలై 31లోగానే ఐటీ రిటర్నులు దాఖలు చేయాలని సూచించింది.

Karnataka: వింత సంప్రదాయం… మరణించిన వారికి 30 ఏళ్ల తర్వాత పెళ్లి!

లేకపోతే సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం రూ.1,000-5,000 వరకు జరిమానా పడుతుందని హెచ్చరించింది. ఈ గడువు పెంచే అవకాశం లేదని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. దీంతో చివరి నిమిషంలో చాలా మంది రిటర్నులు దాఖలు చేస్తున్నారు. ఈ కారణంతో గురువారం ఒక్కరోజే దాదాపు 36 లక్షల మంది ఐటీ రిటర్న్‌లు దాఖలు చేశారు. మరోవైపు ఐటీ రిటర్న్ చెల్లించేందుకు ప్రయత్నిస్తే వెబ్‌సైట్ సరిగ్గా పనిచేయడం లేదు. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరగా ఈ లోపాల్ని సరిదిద్దకుండా తమను ఇబ్బంది పెట్టడం సరికాదని చెల్లింపుదారులు అంటున్నారు.

UAE Floods: యూఏఈలో భారీ వర్షాలు.. ఏడుగురు మృతి

కాగా, ఆడిటింగ్ పరిధిలోకి వచ్చేవారికి అక్టోబర్ 31 వరకు గడువు ఉంది. ఇప్పటివరకు దాదాపు 4.09 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. శని, ఆదివారాల్లో మరింత మంది ఐటీ రిటర్న్ దాఖలు చేసే అవకాశం ఉంది.