Rajasthan: స్నేహితుడితో కనిపించిన భార్య.. ఏడు గంటలు చెట్టుకు కట్టేసి కొట్టిన భర్త
స్నేహితుడితో కనిపించిన భార్యను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టాడు భర్త. దాదాపు ఏడు గంటలపాటు ఆమెను చెట్టుకు కట్టేసి ఉంచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు.

Rajasthan
Rajasthan: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. తన స్నేహితుడితో కనిపించిన భార్యను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టాడు భర్త. స్నేహితుడిని కూడా అలాగే కట్టేసి దాడికి పాల్పడ్డాడు. భర్త స్నేహితులు, బంధువులు కూడా దీనికి సహకరించారు. రాజస్థాన్‌లోని, బన్స్‌వారా ప్రాంతంలో ఇటీవల ఈ ఘటన జరిగింది.
CM Stalin: ‘ఒక దేశం-ఒకే భాష’ నినాదంపై మండి పడుతున్న తమిళనాడు సీఎం
ఒక మహిళ, తన భర్త స్నేహితుడితో కొంతకాలంగా సన్నిహితంగా ఉంటోంది. దీనిపై భర్తకు అనుమానం ఉండేది. ఈ క్రమంలో ఇద్దరినీ ఒకేసారి పట్టుకున్నాడు. తర్వాత భార్యను చెట్టుకు కట్టేసి, ఆమెపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దాదాపు ఏడు గంటలు ఆమెను చెట్టుకు కట్టేసే ఉంచాడు. మరో చెట్టుకు తన స్నేహితుడిని కూడా కట్టేశాడు. అతడిపై కూడా దాడి చేశాడు. దీనికి నిందితుడి సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. తనను రక్షించమని మహిళ ఎంతగానో వేడుకున్నా ఎవరూ సహకరించలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాల్ని కొందరు వీడియో తీశారు. తర్వాత ఈ వీడియో వైరల్‌గా మారింది.
Tollywood : నేడు మరోసారి ఫిలిం ఛాంబర్ సమావేశం.. టాలీవుడ్ సమస్యలపై కాదా??
దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ భర్త, సోదరుడితోపాటు, మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు నిందితులు మైనర్లు కావడం విశేషం. ఈ దారుణ ఘటనపై మహిళా కమిషన్ స్పందించింది. నిందితుల్ని వెంటనే అరెస్టు చేసి, బాధితులకు తక్షణం వైద్య సహాయం అందించాలని ఆదేశించింది.