CM Stalin: ‘ఒక దేశం-ఒకే భాష’ నినాదంపై మండి పడుతున్న తమిళనాడు సీఎం

హిందీ భాషను జాతీయ భాషగా మార్చాలనుకుంటున్న కేంద్రంపై తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఈ విధానం సరికాదన్నారు. ఒక దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి వంటివి దేశానికి శత్రువులని, అలాంటి దుష్ట శక్తులకు దేశంలో తావులేదన్నారు.

CM Stalin: ‘ఒక దేశం-ఒకే భాష’ నినాదంపై మండి పడుతున్న తమిళనాడు సీఎం

Cm Stalin

CM Stalin: హిందీ భాషను బలవంతంగా రుద్దాలని కేంద్రం ప్రయత్నిస్తుండటంపై తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఒక దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి వంటివి దేశానికి శత్రువులని, అలాంటి దుష్ట శక్తులకు దేశంలో తావులేదన్నారు. తమిళనాడులో శనివారం జరిగిన ‘ఇండియా ఎట్ 75 మనోరమా న్యూస్ కాంక్లేవ్ 2022’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Fire Accident : రణబీర్ షూటింగ్ సెట్ లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు. ‘‘జర్నలిస్టులను అరెస్టు చేయడం, కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలపై దాడులు చేయడం ద్వారా కేంద్రం నిరంకుశంగా ప్రవర్తిస్తోంది. రాజ్యాంగం కల్పించిన హక్కులకు ఇలా భంగం కలిగేలా చేయడం తప్పు. ఇది దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల్ని మోసం చేయడమే. ఒక భాష ఎప్పుడూ జాతీయ భాష కాదు. ఒకవేళ దీన్ని బలవంతంగా అమలు చేస్తే క్రమంగా ఇతర భాషలు నాశనమవుతాయి. ఒక దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి వంటివి దేశానికి శత్రువులు. వాటికి దేశంలో స్థానం లేదు.

Russo Brothers : రాజమౌళిని కలవడం చాలా సంతోషంగా ఉంది.. ఎవెంజర్స్ డైరెక్టర్స్ ట్వీట్..

కేంద్రం ప్రభుత్వం తీసుకొస్తున్న అనేక విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా సమాంతర పాలన చేయాలని బీజేపీ భావిస్తోంది. మేం మా రాష్ట్రాల్ని పాలించుకోగలం. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడమే మా లక్ష్యం’’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.