Fire Accident : రణబీర్ షూటింగ్ సెట్ లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

రణబీర్ కపూర్ సినిమా షూట్ ముంబైలోని అంధేరి చిత్రకూట్‌ మైదానంలో జరుగుతుంది. ఇందుకోసం ఓ సెట్ ని నిర్మించారు. సెట్ లో ఫైర్ ఆక్సిడెంట్ అవ్వడంతో సెట్ మొత్తం మంటలు వ్యాపించాయి...

Fire Accident : రణబీర్ షూటింగ్ సెట్ లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

Ranbir Kapoor : బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా లవ్ రంజన్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ ముంబైలోని అంధేరి చిత్రకూట్‌ మైదానంలో జరుగుతుంది. ఇందుకోసం ఓ సెట్ ని నిర్మించారు. తాజాగా ఈ షూటింగ్‌ సెట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. ముంబైలో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్‌ సెట్ లో భారీ అగ్నీ ప్రమాదం జరిగింది.

Russo Brothers : రాజమౌళిని కలవడం చాలా సంతోషంగా ఉంది.. ఎవెంజర్స్ డైరెక్టర్స్ ట్వీట్..

చిత్రకూట్‌ మైదానంలో ఏర్పాటు చేసిన సెట్ లో ఫైర్ ఆక్సిడెంట్ అవ్వడంతో సెట్ మొత్తం మంటలు వ్యాపించాయి, దట్టమైన పొగ చుట్టుపక్కల కమ్మేసింది. ప్రమాదంపై ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా ఎనిమిది ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో మూవీ సిబ్బంది మనీశ్‌ దేవాశీ అనే వ్యక్తి మరణించినట్లు తెలుస్తుంది. అలాగే మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో హీరోహీరోయిన్లు, సెలబ్రిటీలు ఎవరూ అక్కడ లేకపోవడం వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ అగ్నిప్రమాదం పై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.