Tollywood : నేడు మరోసారి ఫిలిం ఛాంబర్ సమావేశం.. టాలీవుడ్ సమస్యలపై కాదా??

నేడు ఆదివారం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ బాడీ మీటింగ్ మధ్యాహ్నం 12.00 గంటలకు ఫిలిం ఛాంబర్ లో జరగనుంది. ఈ మీటింగ్ లో కేవలం ఫిలిం ఛాంబర్ కి సంబంధించిన అంశాలని.......

Tollywood : నేడు మరోసారి ఫిలిం ఛాంబర్ సమావేశం.. టాలీవుడ్ సమస్యలపై కాదా??

Film Chamber

Telugu Film Chamber :  గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సమస్యల వలయంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా టికెట్ ధరలు, థియేటర్లకు జనాలు రాకపోవడం, ఓటీటీ రిలీజ్ లు, పరిశ్రమలోని అంతర్గత ఇబ్బందులు, హీరోల రెమ్యునరేషన్స్.. ఇలా చాలా సమస్యలతో టాలీవుడ్ సతమతమవుతోంది. దీనిపై నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా సమస్యలకి పరిష్కారం దొరికేవరకు కొన్ని రోజులు షూటింగ్స్ ఆపాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. నేడు ఆదివారం కూడా మరోసారి ఫిలిం ఛాంబర్ సమావేశం కానుంది. అయితే ఇది టాలీవుడ్ సమస్యలపై చర్చించేందుకు కాదని సమాచారం.

నేడు ఆదివారం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ బాడీ మీటింగ్ మధ్యాహ్నం 12.00 గంటలకు ఫిలిం ఛాంబర్ లో జరగనుంది. ఈ మీటింగ్ లో కేవలం ఫిలిం ఛాంబర్ కి సంబంధించిన అంశాలని చర్చినాచనున్నారు. 40వ సర్వసభ్య సమావేశములో జరిగిన విషయాలను ఆమోదించడం, 2019-2022 సంవత్సరపు వార్షిక నివేదిక, 2019-2020, 2020-2021 సంవత్సరముల ఆడిట్ అయిన మండలి జమ, ఖర్చు లెక్కలను పరిశీలించడం చేయనున్నారు. ఫిలిం ఛాంబరు బైలాస్ ను అనుసరించి 2022-2023 సంవత్సరమునకు ఎన్నుకోబడిన నూతన అధ్యక్షులకు ప్రస్తుత అధ్యక్షులు బాధ్యతలు అప్పగించనున్నారు.

Fire Accident : రణబీర్ షూటింగ్ సెట్ లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

అలాగే ఫిలిం ఛాంబరు జనరల్ ఎలక్షన్స్ గురించి, 2022-2023 సంవత్సరమునకు జమ, ఖర్చు లెక్కల గురించి చర్చించనున్నారు. ఫిలిం ఛాంబర్ కి ఒక న్యాయ సలహాదారుడ్ని కూడా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. అలాగే ఛాంబర్ లోని వ్యక్తులు ఒప్పుకుంటే టాలీవుడ్ సమస్యలపై కూడా చర్చించే అవకాశం ఉంది. దీంతో మరోసారి ఫిలిం ఛాంబర్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.