Bangladesh: మినీ బస్సును ఢీకొన్న రైలు.. 11 మంది మృతి
పట్టాలపై నుంచి వెళ్తున్న మినీ బస్సును ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో శుక్రవారం జరిగింది.

Bangladesh
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం జరిగింది. పట్టాలు దాటుతున్న మినీ బస్సును రైలు ఢీకొనడంతో 11 మంది మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని ఛట్టోగ్రామ్ జిల్లాలో శుక్రవారం జరిగింది. అమాన్ బజార్ ప్రాంతంలోని ఒక కోచింగ్ సెంటర్‌కు చెందిన కొందరు విద్యార్థులు, టీచర్లు మినీ బస్సులో దగ్గర్లోని కొయాచోరో అనే వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లారు. పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా తిరుగు ప్రయాణమయ్యారు.
Cop kicks elderly man: వృద్ధుడిని తన్ని తలకిందులుగా వేలాడదీసిన కానిస్టేబుల్.. వీడియో వైరల్
ఈ క్రమంలో రైలు క్రాసింగ్ దగ్గర గేటు వేసి ఉండకపోవడంతో మినీ బస్సు అలాగే వెళ్లింది. అదే సమయంలో ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వచ్చి పట్టాలపై ఉన్న బస్సును ఢీకొంది. ఒక కిలోమీటరు వరకు మినీ బస్సను రైలు ఈడ్చుకుని వెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 11 మంది మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సేఫ్టీ అధికారులు క్షతగాత్రులను అధికారులు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గేట్‌మ్యాన్‌ను అధికారులు అరెస్టు చేశారు.