Home » Author »Narender Thiru
రైల్వే స్టేషన్లో వృద్ధుడిపై దాడికి పాల్పడ్డాడు కానిస్టేబుల్. విచక్షణారహితంగా కాలితో తన్నుతూ, కొంతదూరం లాక్కెళ్లి, తలకిందులుగా వేలాడదీశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మిగ్ యుద్ధ విమానాలకు భారత సైన్యం త్వరలో వీడ్కోలు పలకనుంది. 2025కల్లా సైన్యంలోంచి ఈ విమానాలను పూర్తిగా తొలగించాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణయించింది. ప్రస్తుతం మన సైన్యం దగ్గర నాలుగు స్క్వాడ్రన్ల మిగ్ విమానాలున్నాయి.
స్మృతి ఇరానీ కూతురుకు వ్యతిరేకంగా చేసిన ట్వీట్లను 24 గంటల్లోగా తొలగించాలని కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించి ముగ్గురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేసింది.
చర్మ వ్యాధులు వస్తే చాలు.. మంకీపాక్స్ సోకిందేమో అనే అనుమానంతో ఆస్పత్రులకు వస్తున్న పేషెంట్ల సంఖ్య ఇటీవల పెరిగిపోయింది. దీంతో వైద్యులు అనవసర ఆందోళన వద్దని సూచిస్తున్నారు. మంకీపాక్స్‌పై సరైన అవగాహన కలిగి ఉంటే చాలంటున్నారు.
దేశంలో మరో మొబైల్ గేమ్‌పై నిషేధం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ‘పబ్జి’గా గుర్తింపు తెచ్చుకున్న ‘బీజీఎమ్ఐ (బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా)’ని కేంద్రం నిషేధించింది. ఈ మేరకు యాపిల్, గూగుల్ సంస్థలు ఈ గేమ్‌ను తమ ఓఎస్‌ల నుంచి తొ�
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,409 కరోనా కేసులు నమోదయ్యాయి. 32 మంది మరణించారు. నాలుగు రోజుల క్రితం వరకు 15 వేలకు చేరిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
సాంకేతిక లోపాలు, చిన్న ప్రమాదాలు వంటి కారణాలతో విమానాల నిలిపివేత కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇండిగో విమానం రన్‌వేపై జారిపోవడంతో ప్రయాణాన్ని అధికారులు నిలిపివేశారు.
లైవ్ షోలో పర్ఫామ్ చేస్తున్న డ్యాన్సర్లపై భారీ ఎల్ఈడీ స్క్రీన్ ఎగిరిపడింది. దీంతో ఇద్దరు డ్యాన్సర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటన హాంకాంగ్‌లో జరిగింది.
స్కూళ్లో బాలికలు ఉన్నట్లుండి ఏడ్వడం, గట్టిగా అరవడం, నేలపై దొర్లడం, తల బాదుకోవడం చేశారు. దీంతో అక్కడున్న టీచర్లకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పిల్లల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఉత్తరాఖండ్‌లోని ఒక గ్రామంలో ఈ ఘటన జరిగింది.
పాకిస్తాన్లో మనీషా రూపేత అనే మహిళ అరుదైన ఘనత సాధించింది. ఆ దేశంలో డీఎస్పీ హోదా సాధించిన తొలి హిందూ మహిళగా నిలిచింది. ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు.
పిల్లలకు తల్లి మాత్రమే సహజ సంరక్షకురాలిగా ఉన్నప్పుడు.. పిల్లల ఇంటిపేరు నిర్ణయించే హక్కు తల్లికి మాత్రమే ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాగే పిల్లల్ని దత్తత ఇచ్చే హక్కు కూడా తల్లికి ఉంటుందని సూచించింది. భర్త మరణించిన తర్వాత ఏ ఇంటి
రైలు కంపార్టుమెంట్లోకి దూరిన పాము కొద్దిసేపు ప్రయాణికుల్ని, రైల్వే అధికారుల్ని హడలెత్తించింది. పామును పట్టుకునేందుకు రైలును మధ్యలో ఆపి అధికారులు గంటసేపు తనిఖీలు నిర్వహించారు.
పదిహేడేళ్లకే ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే ఒక సంవత్సరం ముందుగానే యువత తమ పేరు నమోదు చేసుకోవచ్చు. అయితే, ఓటు హక్కు మాత్రం 18 ఏళ్లకే వస్తుంది.
ఢిల్లీ హైకోర్టు ‘జేమ్స్ బాండ్’పై దేశంలో నిషేధం విధించింది. అయితే, ‘జేమ్స్ బాండ్’ అంటే సినిమా కాదు. చాక్లెట్లు. క్యాడ్బరి సంస్థ తయారు చేసే ‘జెమ్స్’ చాక్లెట్లకు నకిలీగా వచ్చినవే ‘జేమ్స్ బాండ్’/‘జెమ్స్ బాండ్’ చాక్లెట్లు. ఇకపై ఈ నకిలీ చాక్
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించేలా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదురి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అధిర్తోపాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ మహిళా ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ �
2007 తర్వాత పుట్టిన వాళ్లెవరూ ఇకపై జీవితాంతం స్మోకింగ్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే చట్టప్రకారం నేరం. దీని ప్రకారం జైలు శిక్ష కూడా ఉండొచ్చు. అయితే, ఈ చట్టం రాబోతుంది మన దేశంలో మాత్రం కాదు.
ముందునుంచి ఉన్న అంచనాల ప్రకారమే వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్. 0.75 శాతం బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది అక్కడి మార్కెట్లకు జోష్ తెచ్చింది.
మరో చపాతీ ఇవ్వలేదని రిక్షా కార్మికుడిని హత్య చేశాడో మందుబాబు. తాగిన మత్తులో దారుణానికి తెగబడ్డాడు. ఈ ఘటన న్యూఢిల్లీలో మంగళవారం జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
బెంగాల్ మంత్రి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన మరో ఇంట్లో తాజాగా భారీగా నగదు బయటపడింది. మరో రూ.29 కోట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో దొరికిన నగదు మొత్తం రూ.50 కోట్లు.
ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న మంకీపాక్స్‌కు వ్యాక్సిన్ రాబోతుంది. కోవిడ్ తరహాలోనే మంకీపాక్స్ నియంత్రించాలని కేంద్రం భావిస్తోంది. దీనికోసం వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలను కేంద్రం ఆహ్వానించింది. వ్యాక్సిన్ తయారు చేయాల్సిందిగ�