LED Screen Falls: లైవ్ షోలో ఎగిరిపడ్డ భారీ ఎల్ఈడీ స్క్రీన్.. డ్యాన్సర్లకు గాయాలు.. వీడియో వైరల్

లైవ్ షోలో పర్ఫామ్ చేస్తున్న డ్యాన్సర్లపై భారీ ఎల్ఈడీ స్క్రీన్ ఎగిరిపడింది. దీంతో ఇద్దరు డ్యాన్సర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటన హాంకాంగ్‌లో జరిగింది.

LED Screen Falls: లైవ్ షోలో ఎగిరిపడ్డ భారీ ఎల్ఈడీ స్క్రీన్.. డ్యాన్సర్లకు గాయాలు.. వీడియో వైరల్

Led Screen Falls

Updated On : July 29, 2022 / 11:16 AM IST

LED Screen Falls: లైవ్ షోలు జరిగేటప్పుడు అప్పుడప్పుడూ ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. ఇటీవలి కాలంలో షోలలో వినియోగించే ఎల్ఈడీ స్క్రీన్లకు సంబంధించి చాలా ప్రమాదాలే జరిగాయి. తాజాగా హాంకాంగ్‌లో కూడా అలాంటి ప్రమాదమే జరిగింది. హాంకాంగ్‌లోని ఒక స్టేడియంలో గురువారం సాయంత్రం మిర్రర్ అనే పాప్ బ్యాండ్ ప్రదర్శన జరిగింది. ఈ షోకోసం స్టేజ్‌పై భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. స్టేజ్‌పై డ్యాన్సర్లు డ్యాన్స్ పెర్ఫామ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఉన్నట్లుండి ఒక భారీ ఎల్ఈడీ స్క్రీన్ డ్యాన్సర్లపై ఎగిరిపడింది.

Mass Hysteria: అరుపులు.. ఏడుపులు.. స్కూల్లో విచిత్రంగా ప్రవర్తించిన అమ్మాయిలు… అసలేమైంది?

ఈ ఘటనలో ఇద్దరు డ్యాన్సర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటి డ్యాన్సర్లు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఇద్దరినీ స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన సమచారం అందుకున్న పోలీసులు షోను నిలిపివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా స్టేడియంలో ఎలాంటి షోలు నిర్వహించకుండా నిషేధం విధించారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.