Home » Author »Narender Thiru
అవినీతి కేసులో ఈడీ అరెస్టు చేసిన పశ్చిమ బెంగాల్ మంత్రికి మద్దతు కరువైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పార్థ ఛటర్జీ ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. అధికారులు ఎవరికైనా ఫోన్ చేసుకునేందుకు ఇచ్చిన అవకాశం అలా వృథా అయింది.
భద్రాచలం, గోదావరి పరిధిలోని ఏపీకి చెందిన ఐదు విలీన గ్రామాల ప్రజలు తమ పంచాయతీల్ని తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఉద్యమం సాగిస్తున్నారు. దీనికి తెలంగాణకు చెందిన అఖిలపక్ష నేతలు కూడా మద్దతు తెలిపారు.
బైక్ హారన్ ఇచ్చినప్పటికీ పక్కకు తప్పుకోని ఒక దివ్యాంగుడిపై దాడికి పాల్పడిందో బాలిక. అంతేకాదు.. కత్తితో పొడిచి అతడ్ని హత్య చేసింది. అయితే, అతడికి చెవులు వినిపించవు. మాటలు కూడా రావు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే అని పునరుద్ఘాటించారు దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. జమ్మూలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు దిగుతోంది. చైనాకు చెందిన యుద్ధ విమానాలు భారత్ వైపు దూసుకొస్తున్నాయి. మరోవైపు భారత్ కూడా ధీటుగా బదులిస్తూనే, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బాధ్యతతో వ్యవహరిస్తోంది.
హైదరాబాద్, లాల్ దర్వాజలో ఆదివారం జరిగిన బోనాల సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడిందో వైద్య విద్యార్థిని. తను పేషెంట్లకు అందించే అనస్తీషియానే అధిక మోతాదులో తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆదివారం జరిగింది.
స్మృతి ఇరానీ కూతురు జోయిష్ ఇరానీపై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జోయిష్.. గోవాలో అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. వీటిని ఖండించిన స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేతలకు తాజాగా లీగల్ నోటీసు�
జపాన్‌లో భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. సకురజిమ అనే పర్వతం ఆదివారం సాయంత్రం బద్ధలవడంతో ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరం వరకు లావా శిలలు ఎగసిపడుతున్నాయి.
మంకీపాక్స్ వ్యాపించడంలో బిల్‌గేట్స్ కుట్ర ఉందా? కరోనా వైరస్‌తోపాటు, మంకీపాక్స్ వ్యాప్తి కూడా ఆయన అజెండాలో భాగంగానే జరుగుతోందా? ఈ వాదనల్లో నిజమెంత? వైరస్ల వ్యాప్తికి, బిల్గేట్స్కూ నిజంగా సంబంధం ఉందా?
ఆధార్ కార్డు-ఓటర్ ఐడీ లింక్ చేయాలని గత శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్రం బిల్లు తెచ్చింది. ఓటర్ ఐడీతో ఆధార్ కార్డు లింక్ చేయాలన్న కేంద్ర నిర్ణయంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పిటిషన్ ద�
కన్న కొడుకునే అత్యంత కర్కశంగా హత్య చేశాడో తండ్రి. ఆ తర్వాత కొడుకు మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికాడు. వాటిని ప్లాస్టిక్ బ్యాగుల్లో పెట్టి, బయటకు తీసుకెళ్లాడు. ఆరు భాగాల్ని, ఆరు చోట్ల వదిలేశాడు. కానీ, పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన గుజరాత్లో జరిగిం�
‘ఫోర్బ్స్ ఇండియా’ సంస్థ ప్రకటించిన ‘టాప్ 100 డిజిటల్ స్టార్స్’ జాబితాలో తెలంగాణ వాసికి చోటు దక్కింది. పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన సయ్యద్ హఫీజ్ అనే యూట్యూబర్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన పదవీ కాలం ఆదివారంతో ముగియనుంది. ఆల్ ఇండియా రేడియోతోపాటు, దూరదర్శన్‌లో ప్రసంగం ప్రసారమవుతుంది.
దేశంలో ఆరేళ్లలో స్టార్టప్‌ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్రం చేపట్టిన ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమం ద్వారా వీటి సంఖ్య పెరిగినట్లు కేంద్ర మంత్రి పార్లమెంట్లో వెల్లడించారు.
ఒక పక్క దేశంలో బూస్టర్ డోసులు తీసుకునేందుకు ప్రజలు సిద్ధమవుతుంటే.. ఇంకొందరు ఇప్పటివరకు ఒక్క వ్యాక్సిన్ కూడా తీసుకోలేదట. అర్హత కలిగిన దాదాపు 4 కోట్ల మంది ఒక్క డోసు కూడా తీసుకోలేదని కేంద్రం తెలిపింది.
మంకీపాక్స్ కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో దీన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ. శనివారం సాయంత్రం డబ్ల్యూహెచ్ఓ దీనిపై ప్రకటన చేసింది. ప్రస్తుతం 75 దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.
వచ్చే నెలలో దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ప్రతి ఇంటిపై మూడు రోజులపాటు జాతీయ జెండా ఎగరేయాలి. ఈ నేపథ్యంలో కేంద్రం కొన్ని మార్పులు చేసింది.
ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతున్న భారత జనాభా రాబోయే కాలంలో భారీగా తగ్గిపోనుందట. మరో 78 ఏళ్లలో దాదాపు 41 కోట్ల జనాభా తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ దేశాల జనాభా కూడా తగ్గుతుందని ఈ నివేదిక తేల్చింది.
స్మృతి ఇరానీ కూతురు జోయిష్ గోవాలో అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై స్మృతి ఇరానీ స్పందించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి తాను మాట్లాడుతున్నందుకే తన కూతురుపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్న�