Home » Author »Narender Thiru
దేశంలోనే పర్యాటక రంగంలో అత్యధిక ఆదాయం సమకూర్చిన చారిత్రక కట్టడంగా నిలిచింది తాజ్ మహల్. మూడేళ్లలో రూ.132 కోట్ల ఆదాయం సమకూర్చినట్లు ఏఎస్ఐ వెల్లడించింది. కోవిడ్ సమయంలోనూ పర్యాటకుల్ని ఆకర్షించింది.
సాంకేతిక లోపాల కారణంగా విమానాల దారి మళ్లింపు కొనసాగుతూనే ఉంది. తాజాగా గో ఫస్ట్ విమానం ఢిల్లీ నుంచి గువహటి వెళ్తుండగా, మార్గ మధ్యలో విండ్‌షీల్డ్‌లో పగుళ్లు కనిపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని జైపూర్‌కు మళ్లించారు.
వంద కోట్లు ఇస్తే మంత్రి పదవి వచ్చేలా చేస్తామంటూ ఎమ్మెల్యేనే బురిడీ కొట్టేందుకు ప్రయత్నించిందో గ్యాంగ్. అయితే, అనుమానం వచ్చిన ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్వాన్స్ తీసుకునేందుకు వచ్చి, నిందితులు అడ్డంగా బుక్కయ్యారు.
పంజాబ్‌లో పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య భీకర ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఎన్కౌంటర్లో ఒక గ్యాంగ్‌స్టర్ హతమయ్యాడు. మరో గ్యాంగ్‌స్టర్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రజలెవరూ బయటకు రావొద్దని పోలీసులు సూచించారు.
రెస్టారెంట్లు, హోటళ్లలో సర్వీసు ఛార్జీలు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కేసు తదుపరి విచారణ సాగే వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెప్పింది. దీంతో మళ్లీ సర్వీసు ఛార్జీల బాదుడు మొదలు కానుంది.
తన స్కూళ్లో చదివే దివ్యాంగులైన బాలికలపై పదేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడో టీచర్. తాజాగా అతడి మీద బాలికలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు టీచర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
తమ దేశ అధ్యక్షుడిగా ఎవరు ఎంపికైనా శ్రీలంకకు సాయం చేయడం ఆపొద్దని ఇండియాను కోరారు ఆ దేశ ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస. భారత ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, దేశంలోని రాజకీయ పార్టీలు, భారత ప్రజలను ఆయన వేడుకున్నారు.
బ్రిటన్ నూతన ప్రధాని ఎంపిక కోసం పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పోటీలో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ దూసుకెళ్తున్నారు. మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ ఎన్నికలో అత్యధిక ఓట్లు సాధించారు. మొదటి స్థానంలో నిలిచారు.
గడచిన ఐదేళ్లలో ఆర్మీలో 642 మంది, ఎయిర్‌ఫోర్స్‌లో 148 మంది, ఇండియన్ నేవీలో 29 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు సైన్యంలో ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది.
పండుగ సందర్భంగా కాంట్రాక్టర్ లీవ్ ఇవ్వకపోవడంతో పని మధ్యలోనే వదిలేసి ఇళ్లకు బయల్దేరారు 19 మంది కార్మికులు. వీరిలో ఒక కార్మికుడు నదిలో పడి మరణించాడు. మిగతా వారి ఆచూకీ ఇంకా దొరకలేదు.
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈ నెల 21న జరగనున్న ఈడీ విచారణకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరుకానున్నారు. మరోవైపు సోనియా విచారణ సందర్భంగా నిరసనలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది.
కర్ణాటకలో ఒక పెంపుడు చిలుక కనిపించకుండా పోయింది. ఆ చిలుకను కనిపెడితూ రూ.50 వేల బహుమతి ఇస్తామని ప్రకటించింది ఆ చిలుకను పెంచుకుంటున్న కుటుంబం. అంతేకాదు.. ఊరంతా ఫ్లెక్సీలతో దీనిపై ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు.
దేశంలో ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. వంట గ్యాస్, జీఎస్టీ పెంపుతోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రశ్నించాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేశాయి. దీంతో పార్లమెంట్ సమావేశాలు రేపటికి వాయిదాపడ్డాయి.
ఇటీవల జీఎస్టీ పరిధిలోకి వచ్చిన పలు ఉత్పత్తుల విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఈ విషయంపై ఒక ప్రకటన చేశారు. కొన్ని ఉత్పత్తులు విడిగా అమ్మితే, జీఎస్టీ వర్తించదని ఆమె తెలిపారు.
తదుపరి విచారణ జరిపే వరకు నుపుర్ శర్మను అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రతోపాటు ఆమెపై కేసులు నమోదైన రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.
మెవాట్ డీఎస్పీగా పనిచేస్తున్న సురేంద్ర సింగ్‌కు ఈ ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ జరుగుతుందన్న సమచారం అందింది. దీంతో ఈ మైనింగ్‌ను అడ్డుకునేందుకు డీఎస్పీ ఆ ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ అక్రమంగా రాళ్లను తరలిస్తున్న ఒక ట్రక్కు వెళ్తుండటం గమనించా
ముర్షిదాబాద్ జిల్లా, శక్తిపూర్ ప్రాంతంలోని కుమ్రిపూర్ గ్రామంలో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బాంబులు చుడుతున్న మునాయ్ షేఖ్, యూసుఫ్ షేఖ్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఢిల్లీలో మంకీపాక్స్‌పై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఒక సమావేశం నిర్వహించింది. దీనికి పోర్టులు, ఎయిర్‌పోర్టు అధికారులతోపాటు వైద్యాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంకీపాక్స్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జేబీ పర్దీవాలా ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ నుపుర్ శర్మ పిటిషన్‌పై విచారణ జరపనుంది. అలాగే ఆమె వ్యాఖ్యల తర్వాత జరిగిన హత్య, అల్లర్లు వంటి పరిణామాలకు నుపుర్ శర్మనే బాధ్యురాలు అంటూ సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించి
న్యూఢిల్లీలో సోమవారం భారత నావికా దళం (నేవీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన సైనిక శక్తిని ప్రశంసించారు. కేంద్రం తీసుకొచ్చిన ఆత్మనిర్భరత మన రక్షణ రంగానికి ఎంతో మేలు చేస్తుందన్నారు.