Home » Author »Narender Thiru
అమెరికాలో మన వంటల పేర్లు మార్చేస్తున్నారు. అక్కడి రెస్టారెంట్లలో ఇండియన్ ఐటమ్స్‌కు కొత్త పేర్లు పెడుతున్నారు. వాళ్లకు తోచిన పేర్లు పెడుతూ, మనకిష్టమైన వంటల పేర్లు మార్చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది ప్రజలు ఇష్టంగా తినే ఇడ్లీ, వడ, దోశ పేర్ల�
ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలకు గాను, 172 మంది శాసన సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే మహీధర రెడ్డి హైదరాబాద్‌లో తెలంగాణ శాసన సభలో ఓటు వేశారు.
పార్లమెంట్లో 99.18 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. ప్రజలకు నేరుగా ఎన్నుకునే అవకాశం ఉండదు. దేశ పార్లమెంట్లో ఎంపీలు, రాష్ట్రాల అసెంబ్లీల్లో శాసన సభ్యులు ఓటు వేసి, రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
గతంలో ఆహారోత్పత్తులపై జీఎస్టీ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది అని సూచించే టేబుల్‌ను ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ టేబుల్లో హాస్పిటల్ రూమ్స్, హోటల్ రూమ్స్, సోలార్ హీటర్స్, ఎల్ఈడీ ల్యాంప్స్‌పై జీఎస్టీ ఎలా పెరిగిందో పేర్కొన్నారు.
వచ్చే ఏడాది మార్చి నెలాఖరులో ఏపీ అసెంబ్లీకి సంబందింధించి ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీలు, ముగ్గురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. దీంతో ఈ సారి ఈ స్థానాలకు పోటీ పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించ�
కాశీ విశ్వనాథ్ టెంపుల్-జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి ఈ నెల 21న ఈ విచారణ జరగనుంది. గత మే నెలలో జ్ఞానవాపి మసీదులో శివలింగంలాంటి ఒక ఆకృతిని అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఆకృతిని అక్కడ ఫౌంటేన్‌గా వినియోగిస్తున్నారు.
నేను రాసిన కథలే నన్ను రాజ్యసభకు తీసుకొచ్చాయి. ఇది కథ కాదు.. నిజం. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు రావడం సంతోషంగా ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో పూర్తిస్థాయిలో పాల్గొని వివిధ అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటున్నా.
రెండు రోజుల్లోగా పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్ నుంచి నిధులను ఎస్డీఆర్ఎఫ్కు తిరిగి బదిలీ చేయాలని ఆదేశించింది. అలాగే అర్హులైన వారికి పరిహారం చెల్లించకపోవడం, కొంతమంది దరఖాస్తులు తిరస్కరించడం వంటి అంశాలపై కూడా ధర్మాసనం స్పందించింది.
త్వరలో కొత్త ఎమోజీలు రాబోతున్నట్లు ప్రకటించింది యునికోడ్ కన్సార్టియం. ఈ సంస్థే ఎమోజీలను రూపొందిస్తుంటుంది. ఎమోజీ 15.0 అప్డేట్లో భాగంగా కొత్తగా 31 ఎమోజీలు రాబోతున్నట్లు ఎమోజీపీడియా వెల్లడించింది.
విమానంలో కాలిన వాసన వస్తుందన్న కారణంతో ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని దారి మళ్లించారు. శనివారం రాత్రి కాలికట్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని దారి మళ్లించి, మస్కట్‌లో ల్యాండ్ చేశారు.
సింగపూర్‌లో జరిగే ప్రపంచ నగరాల సదస్సుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఆహ్వానం లభించింది. ఈ సదస్సుకు హాజరై ఢిల్లీ మోడల్ గురించి ప్రపంచ నేతలకు కేజ్రీవాల్ వివరిస్తారు
‘‘రాష్ట్రపతి భవన్‌కు కావాల్సింది విగ్రహం (మూర్తి) కాదు. మాట్లాడగలిగే యశ్వంత్ సిన్హా మాత్రమే. కేంద్ర ప్రభుత్వ అభ్యర్థి (ద్రౌపది ముర్ము) కాదు. ఇప్పటివరకు ద్రౌపది ముర్ము ఒక్క ప్రెస్ కాన్పరెన్స్ కూడా నిర్వహించలేదు’’ అని తేజస్వి వ్యాఖ్యానించార�
ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్ జి యిపై, సింధు విజయం సాధించారు. 21-9, 11-21, 21-15 తేడాతో సింధు, వాంగ్ జిని ఓడించింది. మొదటి గేమ్‌ను సింధు గెలుచుకోగా, రెండో గేమ్‌లో దారుణంగా ఓడిపోయింది.
యాక్టివ్ కేసుల శాతం 0.33. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాలివి. ఈ డాటా ప్రకారం.. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,30,81,441. రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది.
వ్యాధి సోకిన పందులు ఉన్న ప్రాంతానికి చుట్టుపక్కల ఒక కిలోమీటర్ వరకు వ్యాధి ప్రభావిత ప్రాంతంగా గుర్తించారు. ఈ ప్రాంతం పరిధిలోని పందుల్ని చంపి, భూమిలో పాతిపెట్టారు. ఈ ప్రాంతం మొత్తాన్ని శానిటైజ్ చేశారు.
శనివారం నాటికి 199.71 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తైంది. ఒకట్రెండు రోజుల్లో 200 కోట్ల మైలురాయి పూర్తవుతుంది. 12-14 ఏళ్ల వయసు కలిగిన వారిలో ఇప్పటివరకు 3.79 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ ఇది.
విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్లు గుర్తించారు. ప్రయాణికుల భద్రత రీత్యా, ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ రావాల్సిన ఇండిగో 6ఈ-1406 విమానాన్ని కరాచీలో ల్యాండ్ చేశాం. అక్కడ ఉన్న ప్రయాణికుల్ని హైదరాబాద్ రప్పించేందుకు మరో విమానాన్ని కరాచీ పం�
ఒక టీవీ షో చూసి స్ఫూర్తి పొందిన వీళ్లు ఆ షోలోలాగా బాలుడిని కిడ్నాప్ చేసి, డబ్బులు డిమాండ్ చేయాలనుకున్నారు. డబ్బులు తీసుకుని బాలుడ్ని వదిలిపెడదామనుకున్నారు. అనుకున్నట్లుగానే ఐదుగురు కలిసి ఎవరో ఒక బాలుడ్ని కిడ్నాప్ చేసేందుకు రెడీ అయ్యాడు.
ఇంతకుముందు ఈ సేవలపై జీఎస్టీ మినహాయింపు ఉండేది. కేంద్ర తాజా నిర్ణయంతో సోమవారం నుంచి ఈ సేవలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. తాజా రూల్స్ ప్రకారం ఆసుపత్రుల్లో ఐసీయా కాకుండా రోజుకు రూ.5వేలు దాటిన రూమ్ రెంట్‌పై 5 శాతం జీఎస్టీ విధిస్తారు.
ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇలా అదనపు వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. జూన్ చివరి వారంలో 45 శాతం అదనపు వర్షపాతం నమోదు కాగా, జూలై 6 వరకు 28 శాతం అదనపు వర్షపాతం నమోదైంది