Air India Express: మస్కట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన భారత విమానం

విమానంలో కాలిన వాసన వస్తుందన్న కారణంతో ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని దారి మళ్లించారు. శనివారం రాత్రి కాలికట్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని దారి మళ్లించి, మస్కట్‌లో ల్యాండ్ చేశారు.

Air India Express: మస్కట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన భారత విమానం

Air India Express

Updated On : July 17, 2022 / 2:24 PM IST

Air India Express: అత్యవసర స్థితితో విమానాల దారి మళ్లింపు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కొనసాగుతూనే ఉంది. విమానంలో కాలిన వాసన వస్తుందన్న కారణంతో ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని దారి మళ్లించారు. శనివారం రాత్రి కాలికట్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని దారి మళ్లించి, మస్కట్‌లో ల్యాండ్ చేశారు.

Arvind Kejriwal: విదేశాలకు వెళ్లకుండా ముఖ్యమంత్రిని అడ్డుకోవడం సరికాదు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఐఎక్స్-355 విమానం కాలికట్ నుంచి దుబాయ్ బయల్దేరింది. మార్గమధ్యలో విమానం నుంచి కాలిన వాసన రావడాన్ని పైలట్లు గుర్తించారు. ఏరోప్లేన్ వెంట్ నుంచి ఈ వాసన వస్తున్నట్లు అనుమానం వచ్చింది. విమాన సిబ్బంది కొంతసేపు తనిఖీలు చేసినప్పటికీ ఎక్కడా కాలిపోయి ఉండటాన్ని గుర్తించలేదు. ఈ విషయాన్ని అధికారులకు సమాచారం అందించారు. విమానంలో ఎక్కడా కాలిపోయిన విషయాన్ని గుర్తించనప్పటికీ, ముందు జాగ్రత్త చర్యగా దగ్గర్లోని మస్కట్‌లో ల్యాండ్ చేశారు.

Teens Kill Boy: టీవీ షో చూసి బాలుడి కిడ్నాప్.. హత్య

ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు విమానయాన సంస్థ తెలిపింది. భారత విమానాలకు సంబంధించి 24 గంటల్లో ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. శనివారం ఇథియోపియాకు చెందిన విమానం ఒకటి అడిస్ అబాబా నుంచి బ్యాంకాక్ వెళ్తుండగా, కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.