Home » Author »Narender Thiru
ఈ అంశంపై ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో యశ్వంత్ సిన్హాకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై అధికారికంగా ప్రకటించారు.
రోగి ఉపయోగించే బెడ్, ఇతర వస్తువులు వంటివి వాడరాదు. మంకీపాక్స్ సోకిన రోగులను ఐసోలేషన్‌లో ఉంచాలి. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు లేదా జంతువులకు దగ్గరగా ఉన్నట్లైతే పూర్తి శుభ్రత పాటించాలి.
సోమవారం (జూలై 18) నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 12 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఆదివారం అఖిలపక్ష సమావేశం జరగనుంది.
ఈ గ్రూప్ పేరు ‘ఘాజ్వా-ఇ-హింద్’. ఈ గ్రూపులో భారతీయులతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి విదేశీయులు సభ్యులుగా ఉన్నారు. ఈ గ్రూపులో మన జాతీయ పతాకం, జాతీయ చిహ్నానికి వ్యతిరేకంగా పలు పోస్టులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
గనులు, ఖనిజాలు, పరిశ్రమలు, విద్య, నైపుణ్యం, విద్యుత్, తయారీ రంగాలకు సంబంధించి ఐదు ఎంవోయూలు కుదుర్చుకునేందుకు ఈ సమావేశం జరుగుతోంది. సహజ వనరులు, అవకాశాలపై సంబంధిత శాఖల ప్రత్యేక, ముఖ్య కార్యదర్శులతో శాఖలవారిగా సమావేశాలు జరుగుతాయి.
విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నా, ప్రభుత్వ అనుమతి లేకుండా ఉన్నా, అలాగే మొదటి జీవిత భాగస్వామి అభ్యంతరం వ్యక్తం చేసినా ఉద్యోగి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు అందవు.
వరదల వల్ల ఎక్కడా ప్రాణ నష్టం ఉండకూడదని సీఎం జగన్, అధికారులకు సూచించారు. అవసరమైనంత వరకు సహాయక బృందాలను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. మరో 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
రాఫెల్ కారో క్వింటెరో అనే డ్రగ్స్ వ్యాపారిని నేవీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. రాఫెల్ దేశంలో అతిపెద్ద డ్రగ్స్ వ్యాపారి. గాదాలజారా కార్టెల్ అనే పెద్ద డ్రగ్స్ నిర్వహణ సంస్థను నడిపిస్తున్నాడు.
దేశ ద్రవ్యోల్బణం కంటే తెలంగాణ ద్రవ్యోల్బణమే ఎక్కువగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే ద్రవ్యోల్బణం గణాంకాలు వేరువేరుగా ఉన్నాయి. అన్ని రాష్ట్రాలపై దేశ ద్రవ్యోల్బణం ప్రభావం ఒకేలా ఉండదు. సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు 7 శాతం కంటే ఎక్కువ ద్రవ్యోల్బణ�
లదాఖ్ సరిహద్దులో చైనా మోహరించిన దళాలను ఉపసంహరించుకోవాలని భారత్ కోరుతోంది. సరిహద్దులో శాంతి, ప్రశాంతత నెలకొనేందుకు ఈ చర్యలు తప్పనిసరి అని భారత్ అంటోంది. ఈ అంశంపై చివరిసారిగా గత మార్చి 11న చర్చలు జరిగాయి.
ఒక హోటల్‌కు ఐదుగురు వ్యక్తులు రాత్రి డిన్నర్ చేసేందుకు వెళ్లారు. అక్కడ వాళ్లు భోజనం చేసిన తర్వాత వెయిటర్ బిల్లు కట్టమని అడిగాడు. దీంతో కోపం తెచ్చుకున్న ఐదుగురు వెయిటర్‌పై దాడికి పాల్పడ్డారు.
చైనా చేసిన పొరపాటే మనం తిరిగి చేయొద్దు. జనాభా నియంత్రణ కోసం ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనాలి అనే చట్టం తీసుకొస్తే సమర్ధించను. ఇది దేశానికి ఎంతమాత్రం మంచిది కాదు. 2030కల్లా దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతుంది. అదే జనాభాను స్థిరంగా ఉంచుతుంది అని �
2020 నుంచి బయటికి వెళ్లని ఆయన, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో పర్యటన ప్రారంభిస్తున్నారు. అయితే, ఇది వ్యక్తిగత పర్యటన మాత్రమే అని, ఎలాంటి పబ్లిక్ లేదా మత సంబంధమైన కార్యక్రమం కాదని దలైలామా కార్యాలయం తెలిపింది.
జమ్మూ-కాశ్మీర్‌లోని పది జిల్లాల్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సర్వే ఇది. ఈ సర్వే ప్రకారం.. రాష్ట్రంలో 2.8 శాతం మంది డ్రగ్స్ బారిన పడ్డారు. వీరిలో కొందరు గతంలో డ్రగ్స్ తీసుకుంటే, ఇంకొందరు ఇప్పటీకీ డ్రగ్స్ తీసుకుంటున్నారు.
కంటి చూపు మెరుగయ్యేందుకు తాజాగా ఐ డ్రాప్స్ డెవలప్ చేశారు అమెరికా శాస్త్రవేత్తలు. రెండు కళ్లలో డ్రాప్స్ వేసుకుంటే చాలు. కంటి చూపు మెరుగవుతుంది. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కూడా ఈ డ్రాప్స్‌కు అనుమతించింది.
ఈ ఫలితం వచ్చిన తర్వాతే అతడికి సోకింది మంకీపాక్సా లేదా అనే సంగతి తెలుస్తుందన్నారు. సంబంధిత రోగికి మంకీపాక్స్ లక్షణాలున్నాయి. అతడు విదేశాల్లో ఉన్నప్పుడు మంకీపాక్స్ సోకిన రోగికి దగ్గరగా మెలిగినట్లు తెలిసింది.
వీధుల్లో అనేక మొసళ్లు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఒక మొసలి వడోదరలో రోడ్డుపైకి కొట్టుకొచ్చింది. స్థానిక విశ్వామిత్ర నది మొసళ్లకు ప్రసిద్ధి. ఇక్కడ వందల సంఖ్యలో మొసళ్లుంటాయి. అయితే, వరదల కారణంగా నది పొంగిపొర్లుతోంది.
ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు పాట్నాలోని నయా టోలా ప్రాంతంలో జూలై 11న దాడులు నిర్వహించి ఇద్దరినీ అరెస్టు చేశారు. ఈ నెల 12న బిహార్‌లో మోదీ పర్యటన సందర్భంగా ఆయన్ను హత్య చేసేందుకు నిందితులు ప్రణాళికలు రూపొందించారు.
కేంద్ర గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 1,36,076 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల శాతం 0.30. రికవరీ రేటు 98.50గా ఉంది. దేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,36,89,989. కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,25,557.
రైలు క్యాన్సిల్ కావడంతో ఒక ప్రయాణికుడికి కార్ బుక్ చేసి గమ్యస్థానానికి చేర్చింది. సత్యం గద్వి అనే ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఏరోస్పేస్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గుజరాత్‌లోని ఏక్తా నగర్ రైల్వే స్టేషన్ నుంచి వడోదరకు టిక్కెట్ బుక్ చేసుకున్నాడు.