Andhra Pradesh: ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నేడు అవగాహనా ఒప్పందం

గనులు, ఖనిజాలు, పరిశ్రమలు, విద్య, నైపుణ్యం, విద్యుత్, తయారీ రంగాలకు సంబంధించి ఐదు ఎంవోయూలు కుదుర్చుకునేందుకు ఈ సమావేశం జరుగుతోంది. సహజ వనరులు, అవకాశాలపై సంబంధిత శాఖల ప్రత్యేక, ముఖ్య కార్యదర్శులతో శాఖలవారిగా సమావేశాలు జరుగుతాయి.

Andhra Pradesh: ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నేడు అవగాహనా ఒప్పందం

Andhra Pradesh

Updated On : July 16, 2022 / 12:25 PM IST

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఆస్ట్రేలియా మధ్య నేడు అనేక అంశాలపై అవగాహనా ఒప్పందం కుదరనుంది. దీనికి సంబంధించిన సమావేశం విశాఖపట్నం, రాడిసన్ బ్లూ హోటల్‌లో శనివారం ఉదయం ప్రారంభమైంది. గనులు, ఖనిజాలు, పరిశ్రమలు, విద్య, నైపుణ్యం, విద్యుత్, తయారీ రంగాలకు సంబంధించి ఐదు ఎంవోయూలు కుదుర్చుకునేందుకు ఈ సమావేశం జరుగుతోంది. ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతోపాటు, ఆస్ట్రేలియాకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీ అధికారులు రాష్ట్రం పరిశ్రమలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు, సంస్కరణలు వంటి అంశాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

Inflation: ద్రవ్యోల్బణం.. తెలంగాణలోనే ఎక్కువ

రాష్ట్రంలోని సహజ వనరులు, అవకాశాలపై సంబంధిత శాఖల ప్రత్యేక, ముఖ్య కార్యదర్శులతో శాఖలవారిగా వేర్వేరు సమావేశాలు జరుగుతాయి. వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక కార్యదర్శులు, డైరెక్టర్లు ఆస్ట్రేలియా ప్రతినిధులకు ప్రజెంటేషన్ ఇస్తారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.