Parliament Monsoon Session: పార్లమెంట్ ముందుకు 24 బిల్లులు.. ఎల్లుండి నుంచి సమావేశాలు ప్రారంభం

సోమవారం (జూలై 18) నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 12 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఆదివారం అఖిలపక్ష సమావేశం జరగనుంది.

Parliament Monsoon Session: పార్లమెంట్ ముందుకు 24 బిల్లులు.. ఎల్లుండి నుంచి సమావేశాలు ప్రారంభం

Parliament

Updated On : July 16, 2022 / 1:31 PM IST

parliament monsoon session 2022: రాబోయే వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటులో 24 బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. సోమవారం (జూలై 18) నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 12 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఆదివారం అఖిలపక్ష సమావేశం జరగనుంది.

Inflation: ద్రవ్యోల్బణం.. తెలంగాణలోనే ఎక్కువ

మరోవైపుఈ సమావేశా ల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రేపు కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్షాలు సమావేశమవుతున్నాయి. టీఆర్ఎస్ కూడా ఈసారి ప్రతిపక్షంగానే వ్యవహరించనుంది. రాష్ట్రపతి ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షంలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై కూడా ప్రతిపక్షాలు చర్చించబోతున్నాయి. ఈ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని ప్రభుత్వం, ప్రతిపక్షాలను కోరనుంది. అఖిల పక్ష సమావేశం నిర్వహించేందుకు పార్లమెంట్ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్ సమావేశాల ఎజెండాను ఈ సందర్భంగా ప్రతిపక్షాల ముందు ఉంచుతారు.

WhatsApp Group: భారత వ్యతిరేక వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్న అడ్మిన్ అరెస్ట్

ప్రధాని నరేంద్ర మోదీతోపాటు రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సారి కేంద్రం ప్రవేశపెట్టే బిల్లుల్లో కొన్ని కీలకమైనవి ఉన్నాయి. వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) అమెండ్‌మెంట్ బిల్, యాంటీ మ్యారిటైమ్ పైరసీ బిల్, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ (అమెండ్‌మెంట్) బిల్, నేషనల్ యాంటీ డోపింగ్ బిల్ వంటివి ఉన్నాయి.