Tejashwi Yadav: రాష్ట్రపతి భవన్‌లో ఉండాల్సింది విగ్రహం కాదు: ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్
‘‘రాష్ట్రపతి భవన్‌కు కావాల్సింది విగ్రహం (మూర్తి) కాదు. మాట్లాడగలిగే యశ్వంత్ సిన్హా మాత్రమే. కేంద్ర ప్రభుత్వ అభ్యర్థి (ద్రౌపది ముర్ము) కాదు. ఇప్పటివరకు ద్రౌపది ముర్ము ఒక్క ప్రెస్ కాన్పరెన్స్ కూడా నిర్వహించలేదు’’ అని తేజస్వి వ్యాఖ్యానించారు.

Bihar Politics Crisis
Tejashwi Yadav: రాష్ట్రపతి భవన్‌లో ఉండాల్సింది విగ్రహం (మూర్తి) కాదు అంటూ ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముపై పరోక్ష విమర్శలు చేశారు బిహార్‌కు చెందిన ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్. సోమవారం జరగబోయే రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా తేజస్వి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్డీయే అభ్యర్థిపై విమర్శలు చేశారు.
Teens Kill Boy: టీవీ షో చూసి బాలుడి కిడ్నాప్.. హత్య
‘‘రాష్ట్రపతి భవన్‌కు కావాల్సింది విగ్రహం (మూర్తి) కాదు. మాట్లాడగలిగే యశ్వంత్ సిన్హా మాత్రమే. కేంద్ర ప్రభుత్వ అభ్యర్థి (ద్రౌపది ముర్ము) కాదు. ఇప్పటివరకు ద్రౌపది ముర్ము ఒక్క ప్రెస్ కాన్పరెన్స్ కూడా నిర్వహించలేదు’’ అని తేజస్వి వ్యాఖ్యానించారు. ద్రౌపది ముర్ముకు ప్రతిపక్షాలు కూడా మద్దతిస్తున్న వేళ తేజస్వి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్సార్సీపీ, బీజేడీ, అకాళీదళ్, జేఎమ్ఎమ్, శివసేన వంటి పార్టీలు ద్రౌపదికి మద్దతు ప్రకటించాయి.
PV Sindhu: సింగపూర్ ఓపెన్ టైటిల్ విజేత సింధూ.. చైనా క్రీడాకారిణిపై విజయం
ఆమ్ ఆద్మీ పార్టీ యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది. సోమవారం రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. రేపే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. ఈ పదవికి ద్రౌపది ముర్ముతోపాటు, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు.