Home » Author »Narender Thiru
బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు కొత్త అర్థం చెప్పారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఎన్డీయే అంటే ‘నో డాటా అవైలబుల్’ అంటూ శనివారం ట్వీట్ చేశారు. ప్రభుత్వం దగ్గర కీలకమైన అంశాలకు సంబంధించిన సమాచారం లేకపోవడంపై విమర్శలు చేశారు.
అక్రమ మైనింగ్ నిలిపివేయాలని కోరుతూ 500 రోజులుగా ఉద్యమం చేసిన వ్యక్తి ఆత్మహత్యకు యత్నించి, ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. బాధితుడి మృతిపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.
తన కొడుకు పుట్టిన రోజు ఉందని, ఇంటికి రావాలని పిలిచి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక రైల్వే ఉద్యోగి. తర్వాత అతడితోపాటు మరో వ్యక్తి కూడా అత్యాచారం చేశాడు. దీనికి మరో ఇద్దరు సహకరించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలో జరిగింది.
ప్రముఖ బ్యాట్స్‌మెన్ కేఎల్.రాహుల్ కరోనా బారిన పడ్డారు. ఈ నెల 29న ప్రారంభం కానున్న వెస్టిండీస్ టూర్‌కు సిద్ధమవుతున్న దశలోనే రాహుల్‌కు కరోనా సోకింది. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయన టోర్నీలో అడుగుపెట్టాల్సి ఉంటుంది.
క్రికెట్ స్టేడియంలలో మంచి నీళ్లు ఏర్పాటు చేసేలా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌పై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు క్రికెట్ కిట్ కొనివ్వగలిగిన పేరెంట్స్.. మంచి నీళ్లు కొనివ్వలేరా? అని ప్రశ్నించింది.
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉన్నయశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. రాష్ట్రపతి పదవి చేపట్టనున్న తొలి గిరిజన మహిళగా నిలిచారు. ఈ నెల 25న ఆమె రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి విపక్షాల కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎమ్సీ) నిర్ణయించింది. ఈ విషయాన్ని టీఎమ్సీ ఎంపీ, ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ �
‘కంబళ పోటీ వీరుడు’ శ్రీనివాస గౌడ సాధించిన విజయాలు ఫేక్ అంటూ తాజాగా అతడిపై పోలీసు కేసు నమోదైంది. కంబళ పోటీల్లో ఫేక్ రికార్డులు నెలకొల్పి, వాటి ద్వారా వచ్చిన పేరుతో లక్షల రూపాయల విరాళాలు సేకరించాడని ఆయనపై చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వివాహం కాకుండానే గర్భం దాల్చిన మహిళ 24 వారాలలోపు గర్భాన్ని తొలగించుకోవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవివాహిత అయిన కారణంగా ఆమె గర్భాన్ని తొలగించుకునే హక్కును నిరాకరించలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
జమ్ము-కాశ్మీర్లో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడిన కారణంగా రహదారికి ఇరువైపులా వాహనాలు స్తంభించిపోయాయి. రోడ్లపై పెద్దపెద్ద రాళ్లు ఉండటంతో అధికారులు వాటిని తొలగిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గర్భిణి ఘటనా స్థలంలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం కొద్దిసేపటికే గాయాల కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది.
రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ము జీవితంలో విజయాలతోపాటు విషాదాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో తీవ్ర విషాదాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో తన ప్రయాణం కొనసాగించారు. దేశ అత్యున్నత పదవి కోసం పోటీలో నిలిచారు.
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాందీ విచారణ గురువారం ముగిసింది. తిరిగి సోమవారం మళ్లీ విచారిస్తామని ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు ఈ విచారణకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి.
కొంతకాలంగా వ్యూయర్షిప్ పెరగడం లేదని భావించిన హైదరాబాద్ యూట్యూబర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ యువకుడు ఇంజనీరింగ్ చదువుతూనే లైవ్ గేమింగ్ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు.
ట్రక్కును ఆపేందుకు ప్రయత్నించిన పోలీస్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టి చంపాడు డ్రైవర్. అనంతరం కొంతదూరంలో ట్రక్కును వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రం మంత్రి జితేంద్ర సింగ్ ఈ వివరాలు వెల్లడించారు.
గత ఏప్రిల్ 12న కాంట్రాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డ కేసుకు సంబంధించి కర్ణాటక మాజీ మంత్రికి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ ఆత్మహత్యతో మాజీ మంత్రికి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు.
సిట్రన్ ఇండియా నుంచి సీ3 పేరుతో కొత్త కారు బుధవారం మార్కెట్లోకి విడుదలైంది. దేశంలోని 19 షో రూమ్‌లలో బుధవారం నుంచి ఈ కార్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఆన్‌లైన్‌లోనూ కార్ బుక్ చేసుకునే వీలుంది.
సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ గతంలో ఎత్తేసిన రాయితీ ఇకపై ఎప్పటికీ కొనసాగదు. టిక్కెట్లపై ఇచ్చే సబ్సిడీని తిరిగి పునరుద్ధరించబోమని రైల్వే శాఖ మంత్రి ప్రకటించారు. మార్చి 2020 నుంచి రాయితీ రద్దైంది.
ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంపై వస్తున్న విమర్శలపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్లే రాష్ట్రంలో ధాన్యం సేకరణ చేయలేదన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు.