Vijayendra Prasad: రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన విజయేంద్ర ప్రసాద్

నేను రాసిన కథలే నన్ను రాజ్యసభకు తీసుకొచ్చాయి. ఇది కథ కాదు.. నిజం. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు రావడం సంతోషంగా ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో పూర్తిస్థాయిలో పాల్గొని వివిధ అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటున్నా.

Vijayendra Prasad: రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad

Updated On : July 18, 2022 / 3:38 PM IST

Vijayendra Prasad: ప్రముఖ సినీ రచయిత వి.విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) రాజ్యసభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎంపికైన సంగతి తెలిసిందే. సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను రాసిన కథలే తనను రాజ్యసభకు తీసుకొచ్చాయన్నారు. ‘‘నేను రాసిన కథలే నన్ను రాజ్యసభకు తీసుకొచ్చాయి. ఇది కథ కాదు.. నిజం. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు రావడం సంతోషంగా ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో పూర్తిస్థాయిలో పాల్గొని వివిధ అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటున్నా.

Supreme Court: ఆ నిధులు ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలకు బదిలీ చేయండి: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

రాజ్యసభకు ఎంపికవుతానని నేను ఎప్పుడూ ఊహించలేదు. రాజ్యసభకు నామినేట్ కావడం నా బాధ్యతను మరింత పెంచింది. ప్రజలకు సంబంధించిన సమస్యలను రాజ్యసభ దృష్టికి తీసుకొస్తా’’ అని విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు.