Nupur Sharma: నుపుర్ శర్మకు ఊరట.. అరెస్టు నుంచి మినహాయింపు

తదుపరి విచారణ జరిపే వరకు నుపుర్ శర్మను అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రతోపాటు ఆమెపై కేసులు నమోదైన రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.

Nupur Sharma: నుపుర్ శర్మకు ఊరట.. అరెస్టు నుంచి మినహాయింపు

Nupur Sharma

Updated On : July 19, 2022 / 3:53 PM IST

Nupur Sharma: తనపై నమోదైన కేసుల విషయంలో అరెస్టు చేయకుండా స్టే విధించాలని కోరుతూ నుపుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ అంశంపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణ జరిపే వరకు నుపుర్ శర్మను అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Mining Mafia Killed DSP: ట్రక్కు ఎక్కించి పోలీస్‌ను చంపిన మైనింగ్ మాఫియా

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రతోపాటు ఆమెపై కేసులు నమోదైన రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 10న ఈ కేసుపై తదుపరి విచారణ జరగనుంది. జస్టిస్ సూర్య కాంత్, జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపి తాజా నోటీసులు జారీ చేసింది. కేసు విచారణ కోసం అన్ని కోర్టులకు తిరగాల్సిన అవసరం లేదని సూచించింది. కొద్ది రోజుల క్రితం నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున వివాదం మొదలైంది.

Monster Fish : వలలో పడ్డ అరుదైన భారీ చేప..అపశకునమని హడలిపోతున్న మత్స్యకారులు

ఆమెపై ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, జమ్ము-కాశ్మీర్, అసోంలలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ సందర్భంగా తనను అరెస్టు చేయకుండా స్టే విధించాలని కోరుతూ నుపుర్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే అన్ని కేసులను ఢిల్లీలో మాత్రమే విచారించేలా చూడాలని కూడా కోరారు.