Go First Flight: విండ్‌షీల్డ్‌లో పగుళ్లు.. ఢిల్లీ-గువహటి విమానం దారి మళ్లింపు

సాంకేతిక లోపాల కారణంగా విమానాల దారి మళ్లింపు కొనసాగుతూనే ఉంది. తాజాగా గో ఫస్ట్ విమానం ఢిల్లీ నుంచి గువహటి వెళ్తుండగా, మార్గ మధ్యలో విండ్‌షీల్డ్‌లో పగుళ్లు కనిపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని జైపూర్‌కు మళ్లించారు.

Go First Flight: విండ్‌షీల్డ్‌లో పగుళ్లు.. ఢిల్లీ-గువహటి విమానం దారి మళ్లింపు

Go First Flight

Updated On : July 20, 2022 / 5:34 PM IST

Go First Flight: వివిధ కారణాలతో విమానాల దారి మళ్లింపు, అత్యవసర ల్యాండింగ్ వంటి ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ జరుగుతున్నాయి. తాజాగా గో ఫస్ట్ సంస్థకు చెందిన రెండు విమానాలు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాయి. మంగళవారం గో ఫస్ట్ విమానం ఢిల్లీ నుంచి గువహటి వెళ్తుండగా, మార్గ మధ్యలో విండ్‌షీల్డ్‌లో పగుళ్లు కనిపించాయి.

Encounter: పంజాబ్‌లో ఎన్‌కౌంటర్.. పోలీసులు, సిద్ధూ మూసేవాలా హంతకులకు మధ్య కాల్పులు

దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని తిరిగి ఢిల్లీ తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా ల్యాండింగ్ కష్టమవుతుందని భావించి, జైపూర్‌కు మళ్లించారు. అక్కడ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది. అదే రోజు మరో ఘటనలో ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయల్దేరిన విమానం ఇంజిన్లలో ఒక ఇంజిన్‌కు సాంకేతిక సమస్య ఉన్నట్లు పైలట్లు గుర్తించారు. దీంతో వెంటనే విమానాన్ని తిరిగి శ్రీనగర్ పంపించారు. అంతకుముందు రోజు కూడా గో ఫస్ట్ విమానానికి సంబంధించి ఇలాంటి సమస్యే ఎదురైంది. ముంబై నుంచి లేహ్ వెళ్తుండగా విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అత్యవసరంగా విమానాన్ని ఢిల్లీలో ల్యాండ్ చేశారు.

Service Charge Row: రెస్టారెంట్లలో సర్వీసు ఛార్జీల రద్దుపై ఢిల్లీ హై కోర్టు స్టే

ఇటీవలి కాలంలో స్పైస్‌జెట్, ఇండిగో, గో ఫస్ట్ విమానాలు తరచూ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వీటిని అత్యవసరంగా మరో చోట ల్యాండ్ చేయాల్సి వస్తోంది. కొన్నిసార్లు విమానాల్ని రద్దు కూడా చేస్తున్నారు. నెల రోజుల్లోనే ఇలాంటి ఘటనలు తొమ్మిది జరిగినట్లు డీజీసీఏ తెలిపింది. ఈ ఘటనలపై డీజీసీఏ దృష్టి సారించింది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై కొన్ని సూచనలు చేసింది.