Service Charge Row: రెస్టారెంట్లలో సర్వీసు ఛార్జీల రద్దుపై ఢిల్లీ హై కోర్టు స్టే

రెస్టారెంట్లు, హోటళ్లలో సర్వీసు ఛార్జీలు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కేసు తదుపరి విచారణ సాగే వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెప్పింది. దీంతో మళ్లీ సర్వీసు ఛార్జీల బాదుడు మొదలు కానుంది.

Service Charge Row: రెస్టారెంట్లలో సర్వీసు ఛార్జీల రద్దుపై ఢిల్లీ హై కోర్టు స్టే

Service Charge Row

Service Charge Row: రెస్టారెంట్లు, హోటళ్లలో సర్వీసు చార్జీలు విధించకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖతోపాటు, కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. రెస్టారెంట్లు, హోటళ్లు వినియోగదారుల నుంచి సర్వీసు ఛార్జీలు వసూలు చేయకూడదని ఈ నెల 4న కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Ajwain Jeera Tea : ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ, గుండె ప‌నితీరు మెరుగుపరిచే వాము, జీలకర్ర టీ!

అలా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ‘ద నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ)’ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు మంగళవారం స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. డబ్బులు చెల్లించకూడదనుకుంటే వినియోగదారులు రెస్టారెంట్లకు వెళ్లకుండా ఉండే అవకాశం ఉందని జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యాఖ్యానించారు. అలాగే మెనూతోపాటు సర్వీస్ ఛార్జీని కూడా డిస్‌ప్లేలో, మెనూ కార్డులో ఉంచాలని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణ నవంబర్ 25న జరుగుతుంది.

Paddy Issue: కేంద్రం వర్సెస్ రాష్ట్రం.. @ధాన్యం వివాదం

అప్పటివరకు సర్వీస్ ఛార్జీలపై కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై స్టే వర్తిస్తుంది. అంటే రెస్టారెంట్లు, హోటళ్లు సర్వీసు ఛార్జీలు విధించుకోవచ్చు. అయితే, వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే సర్వీసు ఛార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.