Sonia Gandhi: 21న ఈడీ విచారణకు హాజరుకానున్న సోనియా గాంధీ

నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈ నెల 21న జరగనున్న ఈడీ విచారణకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరుకానున్నారు. మరోవైపు సోనియా విచారణ సందర్భంగా నిరసనలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది.

Sonia Gandhi: 21న ఈడీ విచారణకు హాజరుకానున్న సోనియా గాంధీ

Sonia Gandhi

Updated On : July 19, 2022 / 6:31 PM IST

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టనున్న విచారణకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరుకానున్నారు. ఈ నెల 21న ఈ విచారణ జరుగుతుంది. ఈ కేసు విచారణకు హాజరుకావాలని గతంలోనే సోనియాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దీని ప్రకారం గత నెలలోనే సోనియా గాంధీ విచారణకు హాజరుకావాల్సి ఉంది.

African Grey Parrot: కనిపించకుండా పోయిన చిలుక.. కనిపెడితే రూ.50 వేల బహుమతి

అయితే, కరోనా సోకడంతో విచారణకు హాజరు కాలేదు. ఈ విషయాన్ని ఈడీకి తెలియజేసి అనుమతి కూడా తీసుకున్నారు. అయితే, కరోనా నుంచి కోలుకోవడంతో ఇటీవల మళ్లీ సమన్లు జారీ చేసింది ఈడీ. దీంతో గురువారం జరిగే విచారణకు హాజరవ్వాలని సోనియా నిర్ణయించుకున్నారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలోనే ఈ విచారణ జరుగుతుంది. గత నెలలో సోనియా గాంధీ తనయుడు రాహుల్ గాంధీని ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. ఐదు రోజులపాటు.. సుమారు 55 గంటలపాటు రాహుల్‌ను ఈడీ ప్రశ్నించింది. రాహుల్ విచారణ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేసింది.

Nupur Sharma: నుపుర్ శర్మకు ఊరట.. అరెస్టు నుంచి మినహాయింపు

కేంద్ర దర్యాప్తు సంస్థల్ని బీజేపీ ప్రతిపక్షాలపైకి ప్రయోగిస్తోందని కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. కాగా, సోనియా విచారణ సందర్భంగా కూడా ఇలాగే నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు ఈ విచారణ ద్వారా సానుభూతి పొందేందుకు సోనియా ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.