African Grey Parrot: కనిపించకుండా పోయిన చిలుక.. కనిపెడితే రూ.50 వేల బహుమతి

కర్ణాటకలో ఒక పెంపుడు చిలుక కనిపించకుండా పోయింది. ఆ చిలుకను కనిపెడితూ రూ.50 వేల బహుమతి ఇస్తామని ప్రకటించింది ఆ చిలుకను పెంచుకుంటున్న కుటుంబం. అంతేకాదు.. ఊరంతా ఫ్లెక్సీలతో దీనిపై ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు.

African Grey Parrot: కనిపించకుండా పోయిన చిలుక.. కనిపెడితే రూ.50 వేల బహుమతి

African Grey Parrot

African Grey Parrot: పెంపుడు జంతువులంటే కొందరికి ప్రాణం. వాటికేమైనా అయితే అస్సలు తట్టుకోలేరు. తల్లడిల్లిపోతారు. అలాంటిది అవే కనిపించకుండా పోతే ఇంక వారి బాధ మాటల్లో చెప్పడం కష్టం. తాజాగా కనిపించకుండా పోయిన తన పెంపుడు చిలుక విషయంలో అలాగే బాధపడుతున్నాడు కర్ణాటకకు చెందిన అర్జున్. తన పెంపుడు చిలుకను ఎక్కడుందో కనిపెడితే రూ.50 వేల బహుమతి కూడా ఇస్తానంటున్నాడు.

Parliament Session 2022: ధరల పెరుగుదల, జీఎస్టీపై ప్రతిపక్షాల నిరసన.. ఉభయ సభలు రేపటికి వాయిదా

తుమకూరుకు చెందిన అర్జున్ కుటుంబం మూడేళ్లక్రితం ఆఫ్రికన్ గ్రే జాతికి చెందిన చిలుకల జతను తెచ్చి పెంచుకుంటున్నారు. వాటికి రుస్తుమా, రియో అని పేర్లు పెట్టారు. వాటిని చాలా అపురూపంగా చూసుకుంటున్నారు. తినడం, నిద్రపోవడం, ఆడుకోవడం.. ఇలా వాటితోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేవారు. అయితే, మూడు రోజుల క్రితం రుస్తుమా కనిపించకుండా పోయింది. రియో మాత్రం కిటికీ దగ్గరే ఉండిపోయింది. దీంతో తప్పిపోయిన రుస్తుమా కోసం అర్జున్ కుటుంబం ఎంతగానో ఎదురు చూస్తోంది. ఆ చిలుక తమకెంతో ఇష్టమని, తను కనిపించకుండా పోవడంతో ఎంతో బాధ అనుభవిస్తున్నామని అర్జున్ కుటుంబం తెలిపింది. అయితే, మూడు రోజులుగా వెతుకుతున్నా చిలుక జాడ దొరక్కపోవడంతో ఊరంతా ఫ్లెక్సీలతో ప్రచారం చేయాలని నిర్ణయించారు.

Nupur Sharma: నుపుర్ శర్మకు ఊరట.. అరెస్టు నుంచి మినహాయింపు

తుమకూరులోని ప్రధాన వీధుల్లో చిలుక ఫొటోతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, చిలుక జాడ చెప్పినా, పట్టిచ్చినా రూ.50 వేల బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆ చిలుక బంగ్లా మీద కనిపించినా, చెట్టుపైన కనిపించినా, ఎగురుతూ ఉన్నప్పుడు చూసినా తమకు తెలియజేయాలని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. అందులో తమ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంచారు. గతంలో చిలుక ఎక్కడికీ పోలేదని, తమ ఇంటి దగ్గర్లోనే ఎక్కడో ఉండి ఉంటుందని అర్జున్ ఫ్యామిలీ భావిస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై అక్కడి సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతోంది. చిలుక ఎక్కడుందో కనిపెట్టేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు.