Parliament Session 2022: ధరల పెరుగుదల, జీఎస్టీపై ప్రతిపక్షాల నిరసన.. ఉభయ సభలు రేపటికి వాయిదా

దేశంలో ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. వంట గ్యాస్‌, జీఎస్టీ పెంపుతోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రశ్నించాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేశాయి. దీంతో పార్లమెంట్ సమావేశాలు రేపటికి వాయిదాపడ్డాయి.

Parliament Session 2022: ధరల పెరుగుదల, జీఎస్టీపై ప్రతిపక్షాల నిరసన.. ఉభయ సభలు రేపటికి వాయిదా

Parliament Session

Parliament Session 2022: దేశంలో పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, జీఎస్టీ పెరుగుదలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. పార్లమెంటులో నిరసన వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర పార్టీలు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నాయి. రాహుల్ గాంధీ కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. లోక్‌సభ, రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో ఉభయ సభలు స్తంభించాయి. సమావేశాలు రేపటికి వాయిదాపడ్డాయి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు(Parliament Session 2022) సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Mining Mafia Killed DSP: ట్రక్కు ఎక్కించి పోలీస్‌ను చంపిన మైనింగ్ మాఫియా

రెండోరోజైన మంగళవారం ఉభయ సభలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. పెరిగిపోతున్న ధరలు, జీఎస్టీ పెంపు నిర్ణయాలపై కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేశాయి. టీఆర్ఎస్ ఎంపీలు కూడా పార్లమెంట్ వెలుపల తమ నిరసన తెలియజేశారు. పార్లమెంట్ భవనం లోపలికి ప్లకార్డులను అనుమతించబోమని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగిస్తామని పార్లమెంట్‌లో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. మరోవైపు కేజ్రీవాల్ సింగపూర్ పర్యటనకు కేంద్రం ఇంకా అనుమతివ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కేజ్రీవాల్ విదేశాలకు వెళ్లేందుకు వెంటనే అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు.

GST: విడిగా అమ్మితే వీటికి జీఎస్టీ నుంచి మినహాయింపు

శ్రీలంక సంక్షోభం విషయంలో భారత వైఖరిని వివరించేందుకు కేంద్రం ప్రతిపక్షాలతో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జైశంకర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషితోపాటు ఉభయ సభలకు చెందిన అన్ని పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. శ్రీలంకలో నెలకొన్న పరిస్థితిని, భారత్ అనుసరిస్తున్న వైఖరిని ఈ సందర్భంగా వివరిస్తారు.