GST: విడిగా అమ్మితే వీటికి జీఎస్టీ నుంచి మినహాయింపు

ఇటీవల జీఎస్టీ పరిధిలోకి వచ్చిన పలు ఉత్పత్తుల విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఈ విషయంపై ఒక ప్రకటన చేశారు. కొన్ని ఉత్పత్తులు విడిగా అమ్మితే, జీఎస్టీ వర్తించదని ఆమె తెలిపారు.

GST: విడిగా అమ్మితే వీటికి జీఎస్టీ నుంచి మినహాయింపు

Gst

GST: అనేక ఉత్పత్తులు సోమవారం నుంచి కొత్తగా జీఎస్టీ పరిధిలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా పలు ఆహారోత్పత్తుల్ని కేంద్రం జీఎస్టీ పరిధిలోకి తెచ్చింది. అయితే, ఆహారోత్పత్తులపై కూడా జీఎస్టీ విధించడంపై విమర్శలు ఎక్కువయ్యాయి. ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

Mining Mafia Killed DSP: ట్రక్కు ఎక్కించి పోలీస్‌ను చంపిన మైనింగ్ మాఫియా

దీంతో కేంద్రం కొన్ని దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇటీవల జీఎస్టీ పరిధిలోకి వచ్చిన పలు ఉత్పత్తుల విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఈ విషయంపై ఒక ప్రకటన చేశారు. కొన్ని ఉత్పత్తులు విడిగా అమ్మితే, జీఎస్టీ వర్తించదని ఆమె తెలిపారు. లేబుల్ లేని, ప్యాక్ చేయని, విడిగా అమ్మే వస్తువులపై జీఎస్టీ ఉండదన్నారు. అవే ఉత్పత్తుల్ని ప్యాక్ చేసి, లేబుల్ వేసి అమ్మితే మాత్రం జీఎస్టీ వర్తిస్తుందని తెలిపారు. తాజా నిబంధనల ప్రకారం.. పప్పు ధాన్యాలు, గోధుమలు, గోధుమ పిండి, ఓట్స్, మొక్కజొన్న, బియ్యం, మరమరాలు, రవ్వ, మైదా పిండి, శనగ పిండి, పెరుగు, లస్సీ, మజ్జిగ వంటివి ప్యాక్ చేయకుండా, లేబుల్ వేయకుండా అమ్మితే జీఎస్టీ వర్తించదు.

Nupur Sharma: నుపుర్ శర్మకు ఊరట.. అరెస్టు నుంచి మినహాయింపు

ఈ నిర్ణయానికి అన్ని రాష్ట్రాలు అంగీకరించాయని కేంద్రం వెల్లడించింది. అయితే, ఆహారోత్పత్తులపై ఇలా పన్ను విధించడం ఇదే మొదటిసారికాదని, రాష్ట్రాలు ఎప్పట్నుంచో పన్నులు వసూలు చేస్తున్నాయని నిర్మలా సీతారామన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.