Home » Author »Narender Thiru
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే బిహార్‌లో నితీశ్-తేజస్వి ఆధ్వర్యంలోని ప్రభుత్వం కూలిపోతుందని అభిప్రాయపడ్డారు బీజేపీకి చెందిన బిహార్ నేత, ఎంపీ సుశీల్ మోదీ. రాష్ట్రంలో ఇకపై తేజస్వినే తెరవెనుక అసలైన సీఎంగా ఉంటారని ఆయన అన్నారు.
జాతీయ జెండాను కొనని వారికి రేషన్ సరుకులు ఇవ్వకపోవడంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఘనంగా జరుపుకోవాల్సిన దేశ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పేదలపై భారం మోపకూడదన్నారు.
కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ ఏదైనా రెండు డోసులు తీసుకున్న వారు ఇకపై ‘కార్బెవాక్స్’ను బూస్టర్ డోసుగా తీసుకోవచ్చు. దీనికి కేంద్రం తాజాగా అంగీకారం తెలిపింది. ముందు తీసుకున్న వ్యాక్సిన్లకు భిన్నమైన దానిని బూస్టర్ డోసుగా అనుమతించడం దేశంలో ఇదే �
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతుంది. ఇకపై యూజర్లు పంపే ‘వ్యూ వన్స్ మెసేజ్’ను ఎవరూ స్క్రీన్‌షాట్ తీయలేరు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ ప్రకటించింది.
విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు శాశ్వత బెయిల్ మంజూరు చేసింది. ఆయన అనారోగ్యాన్ని, వయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, బెయిల్‌ను దుర్వినియోగం చేయరాదని సూచించింది.
రోడ్లు బాగు చేయాలంటూ ఎమ్మెల్యే ముందు వినూత్న నిరసనకు దిగాడో వ్యక్తి. రోడ్డుపై ఉన్న బురద నీటిలోనే స్నానం చేశాడు. అక్కడే యోగా కూడా చేశాడు. ఈ తతంగాన్ని కొందరు వీడియో తీశారు. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది.
బిహార్ సీఎం నితీష్ కుమార్.. బీజేపీకి దూరమవ్వడం ఆర్జేడీకి కలిసొస్తోంది. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నితీష్ కుమార్, ఆ పార్టీ కీలక నేత తేజస్వి యాదవ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారు.
తిరుమల రావాలనుకుంటున్న భక్తులకు టీటీడీ బోర్డు ఒక సూచన చేసింది. రాబోయే ఐదు రోజులు రద్దీ పెరగనుండటంతో దివ్యాంగులు, వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించింది.
కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు. తనకు కోవిడ్ సోకినట్లు ప్రియాంకా గాంధీ బుధవారం ఉదయం వెల్లడించారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు.
ఝార్ఖండ్‌లో దారుణం జరిగింది. 37 ఏళ్ల వయసున్న ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించిందో పదిహేనేళ్ల అమ్మాయి. పెళ్లి కోసం ఇంట్లో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా తల్లిదండ్రులు అడ్డుకున్నారు. దీంతో వారిని దారుణంగా చంపేసింది.
70 ఏళ్ల వయసులో ఒక మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. అది కూడా ఐవీఎఫ్ పద్ధతిలో. దీంతో పెళ్లైన 54 ఏళ్లకు తల్లిదండ్రులుగా మారింది ఆ జంట. ఇన్నేళ్లకు తమ కలను నెరవేర్చుకుంది. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎందరో ప్రముఖులు భారత్‌కు కీర్తి ప్రతిష్టలు అందించి పెట్టారు. విశ్వ వేదికపై భారత్ సత్తా చాటారు. అనేక రంగాల్లో ప్రపంచంలోనే అత్యున్నత నోబెల్ సాధించి పెట్టారు. భారతీయులతోపాటు, భారత సంతతికి చెందిన వాళ్లు ఈ జాబ�
దేశంలో పది గ్రాముల బంగారం ధర రూ.51,940కి చేరింది. వెండి కిలో ధర రూ.57,648కి చేరింది. మరికొద్ది రోజుల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు పదవీకాలం ముగియనుండటంతో పార్లమెంటులో సోమవారం ఆయనకు వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.
కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన ఒక ఢిల్లీ క్రీడాకారిణి.. తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని చెప్పింది. దీనికి వెంటనే ఆప్ ప్రభుత్వం స్పందించింది. ఆమె ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,167 కరోనా కేసులు నమోదయ్యాయి. 41 మంది మరణించారు. 15,549 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం ఈ వివరాలు వెల్లడించింది.
వృద్ధుడిని కుటుంబ సభ్యులే కొట్టి చంపిన ఘటన ఒడిశాలో జరిగింది. చిన్న వివాదం కారణంగా వృద్ధుడిని అతడి కొడుకు, కోడలు, సోదరుడు కలిసి స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా కొట్టి చంపారు.
రాజస్థాన్‌లోని ఒక దేవాలయంలో సోమవారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
బిహార్‌లో బీజేపీ-జేడీయూ బంధానికి బీటలువారుతున్నాయా? సీఎం నితీష్ కుమార్ తాజా వైఖరి చూస్తే నిజమేననిపిస్తుంది. కొంతకాలంగా ఆయన కేంద్రంలో బీజేపీకి దూరంగా ఉంటున్నారు. బీజేపీ ఆహ్వానించిన ఏ సమావేశానికీ వెళ్లలేదు. నిన్నటి నీతి ఆయోగ్ సమావేశానికీ ద�
ఒక పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడి కారును ఢీకొట్టిందో ట్రక్కు. అయితే, అప్పుడే ట్రక్కును ఆపేయకుండా దాదాపు 500 మీటర్లు కారును ఈడ్చుకెళ్లాడు డ్రైవర్. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.