Karnataka Horror: నాలుగేళ్ల కూతురును నాలుగో అంతస్థు నుంచి పడేసి చంపిన తల్లి.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యం

కన్నతల్లే నాలుగేళ్ల కూతురును చంపింది. మానసిక ఎదుగుదల లేని, మాటలు రాని కూతురును భరించడం కష్టమనుకున్న తల్లి, చివరికి తన ప్రాణాలు తీసింది. ఈ ఘటన కర్ణాటకలో గురువారం జరిగింది.

Karnataka Horror: నాలుగేళ్ల కూతురును నాలుగో అంతస్థు నుంచి పడేసి చంపిన తల్లి.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యం

Updated On : August 5, 2022 / 3:50 PM IST

Karnataka Horror: మాతృత్వానికి మచ్చగా మిగిలే ఘటన తాజాగా కర్ణాటకలో జరిగింది. కన్నతల్లే నాలుగేళ్ల కూతురుని, నాలుగో అంతస్థు నుంచి కింద పడేసి చంపింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని సంపంగి రామ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది.

Teacher Arrested: ట్యూషన్‌లో బాలికకు వోడ్కా తాగించిన టీచర్.. స్పృహ కోల్పోయిన విద్యార్థిని

సుష్మా భరద్వాజ్ అనే మహిళ డెంటిస్టుగా పనిచేస్తోంది. ఆమెకు నాలుగేళ్ల కూతురుంది. అయితే, ఆ పాపకు మాటలు రాకపోవడంతోపాటు మానసికంగానూ ఎదుగుదల లేదు. దీంతో దివ్యాంగురాలైన ఆ పాపను చూసుకోవడం సుష్మాకు కష్టంగా మారింది. ఇది తన కెరీర్‌కు సమస్యగా మారింది. దీంతో సుష్మ.. తను నివాసం ఉంటున్న అపార్టుమెంట్‌లోని నాలుగో ఫ్లోర్ నుంచి పాపను కిందకు పడేసింది. ఆ తర్వాత తను కూడా కిందకు దూకే ప్రయత్నం చేసింది. ఈలోపే పక్కనున్న వారు వచ్చి ఆమెను రక్షించారు. నాలుగో అంతస్థు నుంచి కింద పడటంతో పాప అక్కడికక్కడే చనిపోయింది. మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సుష్మపై కేసు నమోదు చేశారు.

BJP counter to Rahul: ప్రజలు తిరస్కరిస్తే ప్రజాస్వామ్యాన్ని నిందిస్తారేం?

సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించి మహిళను నిందితురాలిగా గుర్తించి అరెస్టు చేశారు. గతంలో కూడా తన కూతురును సుష్మ రైల్వే స్టేషన్‌లో వదిలేసేందుకు ప్రయత్నించింది. తర్వాత మహిళ భర్త ఆ పాపను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు.