Teacher Arrested: ట్యూషన్‌లో బాలికకు వోడ్కా తాగించిన టీచర్.. స్పృహ కోల్పోయిన విద్యార్థిని

విద్యాబుద్ధులు చెప్పి విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన టీచరే ఒక స్టూడెంట్‌తో అనుచితంగా ప్రవర్తించాడు. ట్యూషన్ కోసం వచ్చిన పదో తరగతి బాలికకు బలవంతంగా వోడ్కా తాగించాడు. ఆ తర్వాత బాలిక స్పృహ కోల్పోయింది.

Teacher Arrested: ట్యూషన్‌లో బాలికకు వోడ్కా తాగించిన టీచర్.. స్పృహ కోల్పోయిన విద్యార్థిని

Updated On : August 5, 2022 / 3:16 PM IST

Teacher Arrested: పాఠాలు చెప్పాల్సిన టీచర్ విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించాడు. బలవంతంగా బాలికకు ఆల్కహాల్ తాగించాడు. తర్వాత అరెస్టయ్యాడు. ఈ ఘటన గుజరాత్‌లోని నిజాంపురా ప్రాంతంలో ఇటీవల జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ ఖోస్లా అనే వ్యక్తి ట్యూషన్ క్లాసులు చెబుతుండే వాడు.

West Bengal School Job Scam : మరో షాకింగ్ న్యూస్.. అర్పిత పేరు మీద భారీ సంఖ్యలో ఇన్సూరెన్స్ పాలసీలు, అన్నింట్లోనూ నామినీగా అతడే

గత బుధవారం రాత్రిపూట ట్యూషన్ ముగిసిన తర్వాత, ఒక పదో తరగతి విద్యార్థినిని ఆల్కహాల్ తీసుకోమని బలవంతం చేశాడు. తనతోపాటు కూర్చొని వోడ్కా తాగాలి అని కోరాడు. బలవంతంగా ఆ బాలికకు వోడ్కా తాగించాడు. తర్వాత ఆ బాలిక స్పృహ కోల్పోయింది. రాత్రి తొమ్మిదిన్నర గంటలకు మత్తులో ఉన్న బాలికను ఇంటి దగ్గర దింపేశాడు. బాలిక తల్లిదండ్రులు ఆమె పరిస్థితి చూసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స తర్వాత కోలుకుంది. జరిగిన ఘటన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో షాక్ తిన్న తల్లిదండ్రులు టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు టీచర్‌ను అరెస్టు చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ సిటీలో మరో ఘటన జరిగింది.

Article 370 Revocation: రద్దుకు మూడేళ్లు.. ఇప్పుడు కశ్మీర్ ఎలా ఉంది?

ఒక ఇంటి యజమాని.. తన ఇంట్లో అద్దెకుండే కుటుంబానికి చెందిన రెండేళ్ల చిన్నారికి ఆల్కహాల్ తాగించాడు. ఇది చూసిన తల్లిదండ్రులు తమ చిన్నారిని అతడి దగ్గరి నుంచి తీసుకున్నారు. ఆలోపే చిన్నారి స్పృహ కోల్పోయాడు. ప్రస్తుతం చిన్నారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.