West Bengal School Job Scam : మరో షాకింగ్ న్యూస్.. అర్పిత పేరు మీద భారీ సంఖ్యలో ఇన్సూరెన్స్ పాలసీలు, అన్నింట్లోనూ నామినీగా అతడే

ఈడీ అదుపులో ఉన్న పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీలకు సంబంధించి మరో షాకింగ్ అంశం వెలుగుచూసింది. అర్పిత ముఖర్జీ పేరిట భారీ సంఖ్యలో ఎల్ఐసీ పాలసీలు ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. అర్పిత ముఖర్జీ పేరు మీద ఏకంగా 31 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉండటం ఒక ఆసక్తికర విషయం అయితే, అందులో నామినీగా అన్నింట్లోనూ పార్థ ఛటర్జీ పేరే ఉండటం మరో గమనార్హం.

West Bengal School Job Scam : మరో షాకింగ్ న్యూస్.. అర్పిత పేరు మీద భారీ సంఖ్యలో ఇన్సూరెన్స్ పాలసీలు, అన్నింట్లోనూ నామినీగా అతడే

West Bengal School Job Scam : వెస్ట్ బెంగాల్ లో వెలుగుచూసిన టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఈడీ అదుపులో ఉన్న పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీలకు సంబంధించి మరో ఆసక్తికర అంశం వెలుగుచూసింది. అర్పిత ముఖర్జీ పేరిట భారీ సంఖ్యలో ఎల్ఐసీ పాలసీలు ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. అర్పిత ముఖర్జీ పేరు మీద ఏకంగా 31 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉండటం ఒక ఆసక్తికర విషయం అయితే, అందులో నామినీగా అన్నింట్లోనూ పార్థ ఛటర్జీ పేరే ఉండటం మరో గమనార్హం.

అంతేకాదు ఏపీఏ యూటిలిటీ సేవల కింద జనవరి 1, 2012 నుంచి ఇద్దరి మీద భాగస్వామ్యానికి సంబంధించిన దస్తావేజులు వెలుగులోకి వచ్చాయి. ఈ భాగస్వామ్యం పేరు మీదనే పలు ప్రాపర్టీలు కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ అధికారులు వెల్లడించారు. కొన్ని ఆస్తులను నగదు రూపంలోనూ కొనుగోలు చేశారని ఈడీ వివరించింది. అయితే ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనేది కనిపెట్టాల్సి ఉందని దర్యాప్తు సంస్థ చెప్పింది.

WBSSC Scam: మాజీ మంత్రి పార్థా చటర్జీపై చెప్పు విసిరన మహిళ

అంతేకాదు, అర్పిత ముఖర్జీ నివాసంలో జరిపిన సోదాల్లో… బోల్పూర్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగిన ఓ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన కన్వేయన్స్ డీడ్ పత్రాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వెల్లడించింది. ఇది 2012 నాటిదని, దీన్నిబట్టి పార్థ ఛటర్జీ, అర్పిత ముఖర్జీ మధ్య ఆర్థిక, భూ సంబంధ లావాదేవీలు గత పదేళ్లుగా సాగుతున్నాయని అర్థమవుతోందని ఈడీ పేర్కొంది.

ఇదిలా ఉంటే.. మనీల్యాండరింగ్‌ కేసులో పార్థ ఛటర్జీ, అర్పితా ముఖర్జీలను సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాతే అరెస్ట్‌ చేసింది ఈడీ. అర్పితాకు చెందిన ఇళ్ల నుంచి సుమారు రూ. 50 కోట్ల నగదు, ఐదు కేజీల బంగారం, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఆపై ఈడీ ఈ ఇద్దరినీ తమ కస్టడీలోకి తీసుకోగా.. ఆగస్టు 5వ తేదీతో ఆ కస్టడీ ముగియనుంది.

Teacher recruitment scam: నా ఇళ్ళ‌లో దొరికిన డ‌బ్బు నాది కాదు.. నాకు తెలియ‌కుండా పెట్టారు: అర్పిత

కాగా, ఈడీ సోదాల్లో బయటపడ్డ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై జరిగిన కుట్రకు కాలమే సమాధానం చెబుతుందని టీఎంసీ బహిష్కృత నేత.. బెంగాల్‌ మాజీమంత్రి పార్థ ఛటర్జీ చెబుతున్నారు. మరోవైపు ఆయన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ మాత్రం తాను లేని టైమ్ లో తన ఇంట్లో ఆ డబ్బును పార్థనే ఉంచారని, తన ఇంటిని మినీ బ్యాంకుగా వాడుకున్నారని ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో అర్పిత పేరు మీద 31 బీమా పాలసీలు ఉన్నట్టు తేలడం, అన్నింట్లోనూ నామినీగా పార్థ ఛటర్జీ పేరే ఉండటం షాక్ కి గురి చేస్తోంది.