WBSSC Scam: మాజీ మంత్రి పార్థా చటర్జీపై చెప్పు విసిరన మహిళ

ఆయనపై షూ విసిరేందుకే ఇక్కడకు వచ్చాను. పేద ప్రజలు చమటోడ్చి సంపాదించినన సొమ్మును ఆయన దండుకున్నారు. ఆయన మాత్రం లగ్జరీ కార్లలో తిరుతున్నాను. నేను విసిరిన షూ ఆయన తలకు తగిలి ఉంటే ఎంతో సంతోషించేదాన్ని. ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరగడం, రూ.55 కోట్లకు పైగా నగదు పట్టుబడటంతో పశ్చిమబెంగాల్ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

WBSSC Scam: మాజీ మంత్రి పార్థా చటర్జీపై చెప్పు విసిరన మహిళ

west bengal: పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత పార్థా చటర్జీకి చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం ఆయన చికిత్స కోసం ఈఎస్‭ఐ ఆసుపత్రికి తిరిగి వెళ్తుండగా ఒక మహిళ ఆయనపై చెప్పు విసిరింది. అంతటితో ఆగకుండా చెమటోడ్చి సంపాదించిన సొమ్మును ఆయన దండుకుని లగ్జరీ కార్లలో పార్థాపై దుమ్మెత్తిపోసింది. అయితే ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదని మంత్రిపై దాడికి పాల్పడ్డ మహిళే స్వయంగా చెప్పారు. ఆయనపై షూ విసిరేందుకు అక్కడికి వెళ్లినట్లు స్పష్టం ఆమె చేశారు. ఈఎస్‭ఐలో చికిత్స కోసం వచ్చిన ఆమెను అంటాలా నివాసి సుభద్ర ఘార్విగా గుర్తించారు.

ఈ విషయమై సుభద్ర మాట్లాడుతూ ”ఆయనపై షూ విసిరేందుకే ఇక్కడకు వచ్చాను. పేద ప్రజలు చమటోడ్చి సంపాదించినన సొమ్మును ఆయన దండుకున్నారు. ఆయన మాత్రం లగ్జరీ కార్లలో తిరుతున్నాను. నేను విసిరిన షూ ఆయన తలకు తగిలి ఉంటే ఎంతో సంతోషించేదాన్ని. ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరగడం, రూ.55 కోట్లకు పైగా నగదు పట్టుబడటంతో పశ్చిమబెంగాల్ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నగదు కుంభకోణం బయటపడిన తర్వాత కూడా ఎందుకు ఆయనకు (మాజీ మంత్రి) ఖరీదైన నసేవలు అందిస్తున్నారు. వీల్‌చైర్ సౌకర్యం ఎందుకు ఇస్తున్నారు? ఆయన నడవలేరా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల డబ్ల్యూబీఎస్ఎస్‌సీ కుంభకోణంలో జూలై 23న పార్థా ఛటర్జీని ఈడీ అరెస్టు చేసింది. ఆ వెనువెంటనే పీఎంఎల్ఏ కోర్టు ముందు హాజరుపరిచింది. దీంతో ఆయనను నాలుగు రోజల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది.

కాగా, పార్థా విచారణకు సహకరించడం లేదని ఈడీ అధికారులు చెబుతున్నారు. తాను అస్వస్తకు గురవుతున్నట్లు తరుచూ పార్థా చెబుతున్నారని, దీని వల్ల విచారణ సజావుగా సాగడం లేదని వారు అన్నారు. ‘‘అరెస్ట్ చేసిన సమయం నుంచి పార్థా విచారణకు సహకరించడం లేదు. తరుచూ ఆరోగ్య సమస్యల గురించి చెబుతున్నారు. తాను అస్వస్తకు గురయ్యానని మాటిమాటికీ అంటున్నారు. డబ్బు గురించి అడిగితే తనది కాదని ఆయన చెప్పారు. మరి ఆ డబ్బు ఎక్కడిది, ఎవరిది అనే కోణంలో విచారణ సాగిస్తున్నాం’’ అని ఈడీకి చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు.

Hijab Ban: కర్ణాటక హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీం విచారణ