Hijab Ban: కర్ణాటక హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీం విచారణ

హైకోర్టు ఉత్తర్వులపై గత మార్చిలోనే అప్పీలు చేసినప్పటికీ ఇప్పటి వరకూ లిస్టింగ్‌కు రాలేదని అప్పీలుదారు తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ, న్యాయమూర్తులు కృష్ణమురారి, హిమ కోహ్లితో కూడిన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

Hijab Ban: కర్ణాటక హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీం విచారణ

Hijab Ban: కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హాజాబ్‭పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు వేసిన పిటిషన్‭ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. అయితే దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‭ను విచారణకు తీసుకునేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ విషయాన్ని సుప్రీం ముందకు తీసుకెళ్లిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్, అత్యవసర విచారణకు తీసుకోవాలని కోర్టుకు విజ్ణప్తి చేశారు. ‘‘కర్ణాటకకు చెందిన ఈ హిజాబ్ విషయాన్ని మార్చిలో ఫైల్ చేసినప్పటికీ ఇప్పటికీ లిస్ట్ కాలేదు. దీని ద్వారా విద్యార్థులు కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు’’ అని సుప్రీం ధర్మాసనం ముందు ప్రశాంత్ భూషన్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రెండు బెంచ్‭లు పనిలో లేవని, న్యాయవాదులు కుదరుకున్నాక ఈ అంశాన్ని విచారణకు తీసుకుంటామని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు.

Mahua Moitra: అధిక ధరలపై చర్చ జరుగుతుండగా ఖరీదైన బ్యాగ్‭ను కనిపించకుండా దాచిన ఎంపీ!

హైకోర్టు ఉత్తర్వులపై గత మార్చిలోనే అప్పీలు చేసినప్పటికీ ఇప్పటి వరకూ లిస్టింగ్‌కు రాలేదని అప్పీలుదారు తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ, న్యాయమూర్తులు కృష్ణమురారి, హిమ కోహ్లితో కూడిన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సీజేఐ మాట్లాడుతూ, ఒక బెంచ్ ఏర్పాటు చేస్తానని, న్యాయమూర్తుల్లో ఒకరికి ఒంట్లో బాగోలేదనని చెప్పారు. ”కాస్త ఓపిక పట్టండి. న్యాయవాదులు కాస్త కుదురుకున్న వెంటనే ఈ అంశం విచారణకు తీసుకువస్తాం” అని సీజేఐ అన్నారు. దీనికి ముందు, కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జూలై 13న విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తరగతి గదుల్లో హిజాబ్ ధరించేందుకు అనుమతించాలంటూ వేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు గత మార్చి 15న కొట్టివేసింది. హిజాబ్ మతపరమైన ఆచారమేమీ కాదని తీర్పులో పేర్కొంది.