Mahua Moitra: అధిక ధరలపై చర్చ జరుగుతుండగా ఖరీదైన బ్యాగ్‭ను కనిపించకుండా దాచిన ఎంపీ!

సోమవారం పార్లమెంట్‭లో అధిక ధరలపై వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీఎంసీకి చెందిన ఎంపీ కకోలి ఘోష్ డాస్టిదర్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వాన్ని అధిక ధరలపై ప్రశ్నిస్తున్నారు. ఇంతలో ఆమె పక్కన కూర్చున్న........

Mahua Moitra: అధిక ధరలపై చర్చ జరుగుతుండగా ఖరీదైన బ్యాగ్‭ను కనిపించకుండా దాచిన ఎంపీ!

Mahua Moitra: ఒక వైపు పార్లమెంట్‭లో విపక్షాలు ధరల పెరుగుదలపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ధరల పెరుగుదలపై అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విపక్ష నేత ఒకరు ఇదే విషయమై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇంతలో విపక్ష పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మహువా మోయిత్రా తన ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‭ను టేబుల్ కింద దాచడం చర్చనీయాంశమవుతోంది. అధిక ధరల గురించి మాట్లాడుతున్నందునే ఆమె తన బ్యాగ్‭ను కనిపించకుండా పక్కన పెట్టారని నెటిజెన్లు సెటైర్లు వేస్తున్నారు.

MLA Jeevan Reddy : టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్య కుట్ర కేసులో సంచలన విషయాలు

సోమవారం పార్లమెంట్‭లో అధిక ధరలపై వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీఎంసీకి చెందిన ఎంపీ కకోలి ఘోష్ డాస్టిదర్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వాన్ని అధిక ధరలపై ప్రశ్నిస్తున్నారు. ఇంతలో ఆమె పక్కన కూర్చున్న అదే పార్టీకి చెందిన ఎంపీ మహువా తన లూయిస్ వియుట్టన్ బ్యాగ్‭ను ఉన్నట్టుండి టేబుల్ కింద పెట్టారు. అంతే నెటిజెన్లకు కావాల్సినంత మెటీరియల్ దొరికింది. దీంతో #LouisVuitton అనే హ్యాష్‭ట్యాగ్ ట్విట్టర్‭లో ట్రెండింగ్‭లో మారుమోగుతోంది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ నెటిజెన్లు తమకు తోచిన విధంగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ మహువా ఖరీదు చేసిన ఆ లూయిస్ వియుట్టన్ బ్యాగ్‭ ధర రెండు లక్షల రూపాయలు ఉంటుందట.