Fake Traffic Police: అసలు పోలీసులతో కలిసిపోయి చలాన్లు వసూలు చేస్తున్న నకిలీ ట్రాఫిక్ పోలీస్

అతడో నకిలీ ట్రాఫిక్ పోలీసు. రోజూ వారిలాగా డ్రెస్ చేసుకుని, నిజమైన ట్రాఫిక్ పోలీసులతో కలిసి పోయి డ్యూటీ చేసేవాడు. చలాన్ల పేరుతో అక్రమ వసూళ్లే అతడి లక్ష్యం. మిగతా పోలీసులకు అనుమానం వచ్చి ఆరాతీయగా అసలు విషయం తెలిసింది.

Fake Traffic Police: అసలు పోలీసులతో కలిసిపోయి చలాన్లు వసూలు చేస్తున్న నకిలీ ట్రాఫిక్ పోలీస్

Updated On : August 7, 2022 / 4:16 PM IST

Fake Traffic Police: అతడేమీ ట్రాఫిక్ పోలీసు కాదు. కానీ, రోజూ ట్రాఫిక్ పోలీసులాగే డ్రెస్ చేసుకుని, ఒరిజినల్ పోలీసులతో కలిసి డ్యూటీ చేస్తుండేవాడు. వాహనదారుల నుంచి వీలైనంత వసూలు చేసేవాడు. జీతం ఎలాగో రాదు.. చలాన్ల పేరుతో చేసే వసూళ్లే కాబట్టి, దొరికినవారితో దొరికినంత దోచుకునే వాడు. కానీ, చివరకు పోలీసులకు దొరికిపోయాడు.

Black Magic: కూతురుకు దెయ్యం పట్టిందని.. కొట్టి చంపిన తల్లిదండ్రులు

అతడి నకిలీ బాగోతం బయటపడింది. అసోంలోని సానిట్‌పూర్ జిల్లాలో ఒక వ్యక్తి ట్రాఫిక్ ఆఫీసర్‌లా డ్రెస్ చేసుకుని, ఒరిజినల్ పోలీసులతో కలిసిపోయి డ్యూటీ చేసేవాడు. నిజమైన పోలీసులు.. అతడు వేరే బ్రాంచ్ నుంచి వచ్చుంటారేమో అనుకుని పని చేసేవారు. గుహవటి నుంచి వచ్చిన అతడు వేరే పోలీసుల్ని పిలిచి వాహనాలు తనిఖీ చేయమని చెప్పేవాడు. ప్రతి వాహనాన్ని ఆపి, ఫైన్లు వసూలు చేసేవాడు. అయితే, అతడి ప్రవర్తన అనుమానాస్పదంగం ఉండటంతో నిజమైన ట్రాఫిక్ పోలీసులు, ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. తర్వాత పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అతడు ట్రాఫిక్ పోలీసే కాదని.. డబ్బుల కోసం ఇలా మోసం చేస్తూ, వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

Guinness World Record: హెలికాప్ట‌ర్‌కు వేలాడుతూ అత్య‌ధిక‌ పులప్స్‌ చేసిన ఇద్ద‌రు యువ‌కులు.. వీడియో

దీంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా అనేక ప్రాంతాల్లో ఇలాగే ట్రాఫిక్ పోలీసు వేషంలో మోసాలకు పాల్పడ్డట్లు చెప్పాడు. తాను ట్రాఫిక్ పోలీసు అవ్వాలనుకున్నానని, అయితే సరైన చదువు లేకపోవడం వల్ల కుదరలేదని, అందుకే ఇలా చేస్తున్నానని అతడు చెప్పాడు. ప్రస్తుతం పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.