Guinness World Record: హెలికాప్ట‌ర్‌కు వేలాడుతూ అత్య‌ధిక‌ పులప్స్‌ చేసిన ఇద్ద‌రు యువ‌కులు.. వీడియో

హెలికాప్ట‌ర్‌కు వేలాడుతూ అత్య‌ధిక‌ పులప్స్ చేసి గిన్నిస్ ప్ర‌పంచ రికార్డును బ‌ద్ద‌లు కొట్టారు ఇద్ద‌రు యువ‌కులు. నెదర్లాండ్స్‌కు చెందిన యూట్యూబ‌ర్లు, ఫిట్‌నెస్ ట్రైన‌ర్లు స్టాన్ బ్రౌనీ, అర్జెన్ అల్బ‌ర్స్ తాజాగా నెల‌కొల్పిన ఈ రికార్డు గురించి గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డు వివ‌రాలు తెలిపింది. బెల్జియంలోని అంట్‌వెర్ప్ హొయివెనెన్ ఎయిర్‌ఫీల్డ్‌లో తాజాగా హెలికాప్ట‌ర్ల‌కు వేలాడుతూ ఆ ఇద్ద‌రు యూట్యూబ‌ర్లు పులప్స్ చేశారు. మొదట అర్జెన్ అల్బ‌ర్స్ ఒక్క నిమిష‌ంలో మొత్తం 24 పులప్స్ చేశాడు.

Guinness World Record: హెలికాప్ట‌ర్‌కు వేలాడుతూ అత్య‌ధిక‌ పులప్స్‌ చేసిన ఇద్ద‌రు యువ‌కులు.. వీడియో

Guinness World Record

Guinness World Record: హెలికాప్ట‌ర్‌కు వేలాడుతూ అత్య‌ధిక‌ పులప్స్ చేసి గిన్నిస్ ప్ర‌పంచ రికార్డును బ‌ద్ద‌లు కొట్టారు ఇద్ద‌రు యువ‌కులు. నెదర్లాండ్స్‌కు చెందిన యూట్యూబ‌ర్లు, ఫిట్‌నెస్ ట్రైన‌ర్లు స్టాన్ బ్రౌనీ, అర్జెన్ అల్బ‌ర్స్ తాజాగా నెల‌కొల్పిన ఈ రికార్డు గురించి గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డు వివ‌రాలు తెలిపింది. బెల్జియంలోని అంట్‌వెర్ప్ హొయివెనెన్ ఎయిర్‌ఫీల్డ్‌లో తాజాగా హెలికాప్ట‌ర్ల‌కు వేలాడుతూ ఆ ఇద్ద‌రు యూట్యూబ‌ర్లు పులప్స్ చేశారు. మొదట అర్జెన్ అల్బ‌ర్స్ ఒక్క నిమిష‌ంలో మొత్తం 24 పులప్స్ చేశాడు. అంత‌కు ముందు అమెరికా వ్య‌క్తి రొమ‌న్ సహృద్యన్ (23 పులప్స్‌) పేరిట ఉన్న రికార్డును అర్జున్ బద్దలు కొట్టాడు.

అయితే, అర్జెన్ అల్బ‌ర్స్ ఒక్క నిమిష‌ంలో చేసిన  24 పుషప్స్ రికార్డు కొన్ని నిమిషాలు కూడా నిలవలేదు. స్టాన్ బ్రౌనీ అదే హెలికాప్టర్ కు వేలాడుతూ 25 పులప్స్ చేసి  అర్జెన్ అల్బ‌ర్స్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డు తమ యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసింది. వరల్డ్ రికార్డును బద్దలు కొట్టడం కోసం స్టాన్ బ్రౌనీ, అర్జెన్ అల్బ‌ర్స్ దాదాపు 15 రోజుల పాటు హెలికాప్టర్ పై సాధన చేశారని గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డు తెలిపింది. వారిద్దరికీ  రికార్డుకు సంబంధించిన సర్టిఫికెట్లను ఇచ్చింది.