Terrorists Killed: జమ్మూలో ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్ల వీరమరణం

జమ్మూలో సైనిక స్థావరంపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించారు ఇద్దరు తీవ్రవాదులు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో తీవ్రవాదులకు, సైనికులకు మధ్య కాల్పులు జరిగాయి.

Terrorists Killed: జమ్మూలో ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్ల వీరమరణం

Updated On : August 11, 2022 / 10:04 AM IST

Terrorists Killed: జమ్మూకాశ్మీర్‌లో సైనిక స్థావరంపై గురువారం తెల్లవారుఝామున ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు మరణించారు. రాజౌరి జిల్లాలోని పర్గాల్ వద్ద ఉన్న కంచెను దాటి సైనిక స్థావరంవైపు ఇద్దరు తీవ్రవాదులు దూసుకొచ్చారు. ఇది గమనించిన సెంట్రీ గార్డ్ వారిపై కాల్పులు ప్రారంభించాడు.

Gurugram Club: క్లబ్బులో మహిళతో బౌన్సర్ల అసభ్య ప్రవర్తన… ప్రశ్నించినందుకు దాడి.. వీడియో వైరల్‌

ఆ తర్వాత మిగతా సైనికులు కూడా కాల్పులు ప్రారంభించారు. వెంటనే తీవ్రవాదులు కూడా కాల్పులు జరిపారు. దీంతో తీవ్రవాదులకు, సైనికులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందారు. మరో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ఇద్దరు తీవ్రవాదుల్ని సైనికులు కాల్చి చంపారు. గాయపడ్డ సైనికుల్ని ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

Jagdeep Dhankhar: నేడు ఉప రాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌‌ఖడ్‌ ప్రమాణ స్వీకారం

ఈ ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకుని, అన్ని చోట్లా గాలింపులు చేపట్టారు. ఇంకా తీవ్రవాదులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బృందాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు అడిషనల్ డీజీపీ ముఖేష్ సింగ్ చెప్పారు.