GST On Rentals: ఇంటి అద్దెపై 18 శాతం జీఎస్టీ? కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయ్..

గత నెల నుంచి కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం ఇంటి అద్దెపై కూడా 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే. అయితే, అందరూ జీఎస్టీ చెల్లించాల్సిందేనా? యజమాని, అద్దెకు ఉండే వాళ్లు.. ఇద్దరూ జీఎస్టీ చెల్లించాలా? ఎవరు జీఎస్టీ పరిధిలోకి వస్తారు?

GST On Rentals: ఇంటి అద్దెపై 18 శాతం జీఎస్టీ? కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయ్..

GST On Rentals: గత నెల 18 నుంచి కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఇంటి అద్దెపై కూడా 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే. అయితే, ఈ నిబంధన అందరికీ వర్తించదు. అద్దెకుండే ప్రతి ఒక్కరూ జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్ కింద చేసుకున్న వాళ్లు అద్దెకున్నప్పుడు మాత్రమే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

TS EAMCET: తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల.. ఏపీ విద్యార్థినికి మొదటి ర్యాంకు

గతంలో అద్దెపై జీఎస్టీ నిబంధన ఆఫీసులు, వాణిజ్య, వ్యాపార సముదాయాల వంటి కమర్షియల్ స్సేస్‌కు మాత్రమే ఉండేది. ఇళ్ల అద్దెపై జీఎస్టీ ఉండేది కాదు. కానీ, తాజా నిబంధనల ప్రకారం ఇంటి అద్దెపై కూడా 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. అద్దెకుంటున్న ప్రతివారూ జీఎస్టీ పరిధిలోకి రారు. జీఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే జీఎస్టీ చెల్లించాలి. అయితే, అద్దె పన్ను చెల్లించిన తర్వాత ‘ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్’ కింద మినహాయింపు పొందవచ్చు. అలాగే అద్దెకు ఇస్తున్న యజమానులు జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. అద్దెకు ఉండే వారు మాత్రమే జీఎస్టీ చెల్లించాలి.

Divya Kakran: దివ్యా కాక్రన్ వివాదం.. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

యజమాని, అద్దెకు ఉంటున్న వారు ఇద్దరూ జీఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. అద్దెకుండే వారే జీఎస్టీ చెల్లించాలి. ఇద్దరూ జీఎస్టీలో రిజిస్ట్రేషన్ కాకుంటే ఎవరూ చెల్లించాల్సిన అవసరం లేదు. శాలరీపై ఆధారపడి, అద్దెకుండేవారు జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు.