Divya Kakran: దివ్యా కాక్రన్ వివాదం.. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

దివ్యా కాక్రన్ అంశంలో ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకవైపు ఆప్ ప్రభుత్వం తనకేం సాయం చేయడం లేదని దివ్య అంటే.. తామేం సహాయం చేశామో ఆప్ ప్రకటించింది. మరోవైపు ఆప్ తీరును బీజేపీ తప్పుబడుతోంది.

Divya Kakran: దివ్యా కాక్రన్ వివాదం.. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

Divya Kakran: ‘కామన్వెల్త్ గేమ్స్-2022’లో కాంస్య పతకం సాధించిన మహిళా రెజ్లర్ దివ్యా కాక్రన్ విషయంలో బీజేపీ-ఆప్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల దివ్య కాంస్య పతకం గెలిచిన తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు. దీనికి ధన్యవాదాలు చెప్పిన దివ్య.. ఇన్నేళ్లుగా ఢిల్లీలో నివసిస్తున్నప్పటికీ స్థానిక ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని, ఇకనైనా సాయం అందుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది.

Corbevax: నేటి నుంచే కార్బొవాక్స్ వ్యాక్సిన్.. మీరు రెడీయేనా

దీనికి ఆప్.. సమాధానమిచ్చింది. దివ్య.. ఢిల్లీ తరఫున ఆడటం లేదని, కొన్నేళ్లుగా ఆమె ఉత్తర ప్రదేశ్ తరఫున ఆడుతోందని, తమ రాష్ట్రం తరఫున ఆడితే సాయం చేస్తామని ప్రకటించింది. దీనిపై గురువారం దివ్యా కాక్రన్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఢిల్లీలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డానని, ప్రభుత్వం నుంచి సరైన సహాయం కూడా అందలేదని తెలిపింది. ఈ ఆరోపణలపై ఆప్ బదులిచ్చింది. దివ్యకు ఢిల్లీ ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేసినట్లు ప్రకటించింది. దానికి సంబంధించిన వివరాల్ని వెల్లడించింది. ఆమె ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన 2017 వరకు ఎంతెంత ఆర్థిక సహాయం చేసిందో తెలిపింది. మరోవైపు ఆమె ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించినట్లు ఏమైనా ఆధారాలుంటే చూపించండి అని ప్రశ్నించింది.

Telangana Cabinet Key Decisions : కొత్తగా 10లక్షల పెన్షన్లు, 5వేల పోస్టులు భర్తీ.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

దీనికి సమాధానంగా ఢిల్లీ తరఫున ఆడినప్పుడు అందిన సర్టిఫికెట్‌ను దివ్యా కాక్రన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ఒక క్రీడాకారిణిని ఆధారాలుంటే చూపించాలి అని ఆప్ అడగటం వాళ్లను అవమానించడమే అని బీజేపీ విమర్శిస్తోంది. ‘‘ఆప్ చేసిన ఆరోపణ అథ్లెట్లను, దేశ యువతను, జాతీయ పతాకాన్ని అవమానించడమే. క్రీడాకారులు స్టేడియంలో మన దేశం కోసమే పోరాడుతారు. అలాంటి వారిని అనుమానించడం సరికాదు’’ అని బీజేపీ ప్రతినిధి హెహజాద్ పూనావాలా అన్నారు.