TS EAMCET: తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల.. ఏపీ విద్యార్థినికి మొదటి ర్యాంకు

తెలంగాణలో గత నెల నిర్వహించిన ఎంసెట్, ఈసెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో ఫలితాల్ని విడుదల చేశారు.

TS EAMCET: తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల.. ఏపీ విద్యార్థినికి మొదటి ర్యాంకు

TS EAMCET: తెలంగాణలో ఎంసెట్‌, ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌లో ఫలితాలు విడుదల చేశారు. ఈసెట్‌లో 90.69 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. 19,954 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

Jammu And Kashmir: జమ్ము-కాశ్మీర్‌లో ఉగ్రదాడి.. బిహార్ కూలీ మృతి

ఇంజనీరింగ్‌లో లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి (హైదరాబాద్) మొదటి ర్యాంకు సాధించగా, సాయి దీపిక (శ్రీకాకుళం) రెండో ర్యాంకు, కార్తికేయ (గుంటూరు) మూడో ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్‌లో నేహా (గుంటూరు) మొదటి ర్యాంకు సాధించగా, రోహిత్ రెండో ర్యాంకు, తరుణ్ కుమార్ మూడో ర్యాంకు సాధించినట్లు మంత్రి వెల్లడించారు. గత నెలలోనే ఈ పరీక్షలు జరిగాయి. జూలై 18-21 వరకు ఇంజనీరింగ్, 30, 31 తేదీల్లో ఫార్మా ఎంసెట్ పరీక్షలు జరిగాయి. అలాగే ఇంజనీరింగ్‌ రెండో ఏడాది కోర్సులో ప్రవేశాల (లేటరల్‌ ఎంట్రీ) కోసం ఆగస్టు 1న ఈసెట్‌ను నిర్వహించారు.

Divya Kakran: దివ్యా కాక్రన్ వివాదం.. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

ఇంజనీరింగ్ పరీక్షలకు 1,56,812 మంది హాజరుకాగా, అగ్రికల్చర్, ఫార్మాలో ప్రవేశ పరీక్షల కోసం 80,575 మంది హాజరయ్యారు. అభ్యర్థులు ఎంసెట్ ఫలితాల కోసం https://eamcet.tsc-he.a-c.in, ఈసెట్‌ ఫలితాల కోసం https://ecet.tsche.ac.in వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు.