Jammu And Kashmir: జమ్ము-కాశ్మీర్‌లో ఉగ్రదాడి.. బిహార్ కూలీ మృతి

జమ్ము-కాశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బిహార్‌కు చెందిన వలస కూలీ ప్రాణాలు కోల్పోయారు. గురువారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. తీవ్రవాదుల దాడులు జరగడం రెండు రోజుల్లో వరుసగా ఇది రెండోసారి.

Jammu And Kashmir: జమ్ము-కాశ్మీర్‌లో ఉగ్రదాడి.. బిహార్ కూలీ మృతి
ad

Jammu And Kashmir: జమ్ము-కాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. బందిపొరా జిల్లాలోని సాదునారా అనే గ్రామంలో బిహార్‌కు చెందిన వలస కూలీని తీవ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. మృతుడిని మొహమ్మద్ అమ్రేజ్‌గా గుర్తించారు.

Divya Kakran: దివ్యా కాక్రన్ వివాదం.. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసుల్ని లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే, ఈ ఘటనలో సాధారణ పౌరుడైన అమ్రేజ్ గాయపడ్డాడు. వెంటనే అతడ్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు చెప్పారు. గురువారం తెల్లవారుఝామున ఆర్మీ క్యాంపుపై తీవ్రవాదులు దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించగా, ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. వరుసగా రెండు రోజుల్లో రెండు ఘటనలు జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Mumbai: ఆన్‌లైన్‌లో విస్కీ కొనేందుకు ప్రయత్నించి ఐదు లక్షలు పోగొట్టుకున్న మహిళ

గత వారం కూడా పుల్వామా జిల్లాలో బిహార్ కూలీలపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక బిహార్ కూలీ మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రస్తుత ఘటనల నేపథ్యంలో భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు. ఈ ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.