Mumbai: ఆన్‌లైన్‌లో విస్కీ కొనేందుకు ప్రయత్నించి ఐదు లక్షలు పోగొట్టుకున్న మహిళ

ఆన్‌లైన్‌లో విస్కీ కొనేందుకు ప్రయత్నించిన ఒక మహిళ రూ.5.3 లక్షలు పోగొట్టుకుంది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. కేటుగాళ్లు అడిగిన వెంటన బ్యాంకు డీటైల్స్, డెబిట్ కార్డు వివరాలు, సీవీవీ వంటివి చెప్పడం వల్లే ఆమె భారీగా నష్టపోయింది.

Mumbai: ఆన్‌లైన్‌లో విస్కీ కొనేందుకు ప్రయత్నించి ఐదు లక్షలు పోగొట్టుకున్న మహిళ

Mumbai: సైబర్ నేరాలపై ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరు మారడం లేదు. బ్యాంకు డీటైల్స్, కార్డు డీటైల్స్, సీవీవీ నెంబర్లు ఎవరికీ చెప్పొద్దని ఎంతగా ప్రచారం చేస్తున్నా… వాటి సమాచారం నేరగాళ్లకు ఇచ్చి మోసపోతున్నారు. తాజాగా ముంబైకి చెందిన ఒక మహిళ ఇలాగే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి భారీగా నగదు పోగొట్టుకుంది. ఇటీవల ఒక మహిళ తన ఇంట్లో కేక్ తయారు చేసి, డెకరేట్ చేసేందుకు విస్కీ బాటిల్ కావాలనుకుంది.

Telangana Cabinet Key Decisions : కొత్తగా 10లక్షల పెన్షన్లు, 5వేల పోస్టులు భర్తీ.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

దీనికోసం ఆన్‌లైన్‌లో వెతికితే ఒక షాప్ వివరాలు కనిపించాయి. ఆ షాప్ వారిని సంప్రదిస్తే, షాప్ మూసేశారని, కావాలంటే ఇంటికి నేరుగా విస్కీ డెలివరీ చేస్తామని చెప్పారు. ఆన్‌లైన్‌లో ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తామని, దాన్ని స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తే పది నిమిషాల్లో విస్కీ బాటిల్ డెలివరీ చేస్తామని చెప్పారు. దీంతో తనకు పంపిన క్యూఆర్ కోడ్ ఆధారంగా రూ.550 చెల్లించింది. తర్వాత డెలివరీ గురించి వేరే వ్యక్తి కాల్ చేస్తారని చెప్పారు. తర్వాత మరో వ్యక్తి కాల్ చేసి.. డోర్ డెలివరీ చేయాలంటే రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇందుకోసం మరో ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాలని కాల్ కనెక్ట్ చేశారు. ఈ కాల్‌లో ఒక రిసీట్ పంపించి, గూగుల్ పేలో ఆ రిసీట్ నెంబర్ ఎంటర్ చేయాలని చెప్పారు. వారు చెప్పినట్లు 19,051 నెంబర్ ఎంటర్ చేయగానే, అంతే నగదు డెబిట్ అయ్యింది.

Divya Kakran: దివ్యా కాక్రన్ వివాదం.. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

దీంతో ఆమె మొదటి వ్యక్తికి, తన అకౌంట్‌లోంచి రూ.19,051 పోయాయని చెప్పింది. అప్పుడు దానికి అతడు కంగారు పడాల్సింది ఏమీ లేదని, సిస్టమ్‌లో ఎర్రర్ వల్ల అలా జరిగిందని, డబ్బులు తిరిగి రావాలంటే తాను చెప్పినట్లు చేయాలని చెప్పాడు. అలా చేస్తుండగానే మళ్లీ అకౌంట్‌లోంచి రూ.19,051 డెబిట్ అయ్యింది. వెంటనే ఆమె తన డబ్బులు వెనక్కి ఇచ్చేయని అడిగింది. అప్పుడు అతడు మొదటిసారి పోయిన డబ్బులు క్రెడిట్ అవ్వడానికి బదులు సిస్టమ్‌లో ఎర్రర్ వల్ల డెబిట్ అవుతున్నాయని చెప్పాడు. ఆ డబ్బులు తిరిగి రావాలంటే బ్యాంకు అకౌంట్ డీటైల్స్, డెబిట్ కార్డు నెంబర్, సీవీవీ నెంబర్ వంటివి చెప్పాలన్నాడు. దీంతో ఆమె ఆ వివరాలన్నీ అతడికి చెప్పింది. అలాగే ట్రాన్సాక్షన్ లిమిట్ కూడా పెంచింది.

Corbevax: నేటి నుంచే కార్బొవాక్స్ వ్యాక్సిన్.. మీరు రెడీయేనా

పూర్తి వివరాలు తెలుసుకున్న కేటుగాళ్లు ఆమె అకౌంట్‌లోంచి మొత్తం రూ.5.35 లక్షలు కొట్టేశారు. దీంతో మరింత కంగారుపడ్డ ఆమె వారికి తిరిగి కాల్ చేసింది. అయితే, ఆ నెంబర్స్ స్విఛ్చాఫ్ అని వచ్చాయి. దీంతో విషయం గ్రహించిన మహిళ పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్యాంకు అకౌంట్ సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.