Basavaraj Bommai: అవయవదానానికి ముందుకొచ్చిన కర్ణాటక సీఎం, ఆరోగ్య శాఖా మంత్రి

ప్రపంచం అవయవదాన దినోత్సవం సందర్భంగా శనివారం బెంగళూరులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అవయవదానానికి కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై అంగీకారం తెలిపారు.

Basavaraj Bommai: అవయవదానానికి ముందుకొచ్చిన కర్ణాటక  సీఎం, ఆరోగ్య శాఖా మంత్రి

Updated On : August 13, 2022 / 10:21 AM IST

Basavaraj Bommai: అవయవదానం చేసేందుకు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైతోపాటు, రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి డా.కె.సుధాకర్ అంగీకరించారు. ఈ విషయాన్ని మంత్రి డా.కె.సుధాకర్ తెలిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జరుపుకొంటున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ప్రతి ఒక్కరూ అవయవదానికి కూడా ముందుకు రావాలని ఆయన కోరారు.

Karnataka: అధికారులతో గడిపితేనే మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. కర్ణాటక ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత ఆరోపణ

ఇతరుల జీవితాల్లో అమృతం కురిపించేందుకు అవయవదానం చేయాలని సూచించారు. ప్రతి సంవత్సరం ఆగష్టు 13న ప్రపంచ అవయవదాన దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘‘సీఎం బసవరాజు బొమ్మైతోపాటు నేను కూడా అవయవదానానికి ప్రతిజ్ఞ చేస్తాను. శనివారం జరిగే కార్యక్రమంలో అధికారులతో కలిసి మేం పాల్గొంటాం. అందరం కలిసి ప్రతిజ్ఞ చేస్తాం. గతంలో ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ కూడా దేశంలో అందరూ అవయవదానానికి ముందుకు రావాలని కోరారు. రక్త దానం చేస్తున్నట్లుగానే, అవయవదానం కూడా చేయాలని సూచించారు. నటుడు పునీత్ రాజ్ కుమార్ కళ్లు దానం చేయడం వల్ల ఐదుగురికి చూపు దక్కింది. మరో నటుడు సంచారి విజయ్ అవయవదానం వల్ల ఐదుగురి జీవితాల్లో వెలుగులు నిండాయి. అవయవదానంలో కర్ణాటకను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలి’’ అని డా.రాజ్ కుమార్ అన్నారు.

Har Ghar Tiranga: ‘హర్ ఘర్ తిరంగా’ కోసం 20 కోట్ల జాతీయ జెండాలు సిద్ధం

శనివారం జరగబోయే కార్యక్రమంలో అవయవదానానికి అంగీకరించిన దాతల కుటుంబ సభ్యుల్ని సీఎం సన్మానిస్తారు. బెంగళూరులో జరిగే కార్యక్రమంలో మానవహారం కూడా నిర్వహించనున్నారు. దీని ద్వారా ప్రజలకు అవయవదానంపై అవగాహన కల్పిస్తారు.