Ghulam Nabi Azad: రెండు వారాల్లో గులాంనబీ ఆజాద్ కొత్త పార్టీ.. అనుచరుడి వెల్లడి
ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆజాద్‌కు అత్యంత సన్నిహితుడైన సరూరి వెల్లడించారు. రెండు వారాల్లో ఆజాద్ కొత్త పార్టీ పెడతారని చెప్పాడు.

Ghulam Nabi Azad: కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు. రెండు వారాల్లోనే ఆజాద్ కొత్త పార్టీ స్థాపిస్తారని, ఆయనకు అత్యంత సన్నిహితుడైన జీఎమ్.సరూరి వెల్లడించారు. శనివారం సరూరి మీడియాతో మాట్లాడారు.
J.P.Nadda: ప్రజలు త్వరలోనే కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తారు: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా
ముందుగా ఆయన తన పార్టీని జమ్మూ-కాశ్మీర్‌లో స్థాపించబోతున్నారని సరూరి చెప్పాడు. ‘‘ఆగష్టు 5, 2019కు ముందు కాశ్మీర్‌లో ఉన్నప్పటి పరిస్థితుల్ని పునరుద్ధరించడమే కొత్త పార్టీ ప్రధాన లక్ష్యం. ఆజాద్ సెప్టెంబర్ 4న జమ్ము-కాశ్మీర్ వస్తారు. తర్వాత ఆయన సన్నిహితులతో సమావేశమవుతారు. ఆ తర్వాతే కొత్త పార్టీ ప్రకటిస్తారు. అభివృద్ధి, సమాజంలోని అన్ని వర్గాల మధ్య ఐక్యత కోసం పార్టీ పనిచేస్తుంది’’ అని సరూరి వెల్లడించాడు. సరూరి, శుక్రవారం సాయంత్రం ఆజాద్‌తో న్యూ ఢిల్లీలో సమావేశమయ్యారు. సరూరితోపాటు మరికొందరు నేతలు ఆజాద్‌ను కలిసి రాజకీయ వ్యూహంపై చర్చించారు. ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆజాద్.. ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు.
ఆయనతోపాటు జమ్ము-కాశ్మీర్‌కు చెందిన మరో ఐదుగురు కీలక నేతలు కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఈ సమయంలోన ఆజాద్ కొత్త పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఆయన అనుచరుడు దీన్ని ధృవీకరించాడు.