J.P.Nadda: ప్రజలు త్వరలోనే కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తారు: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా

తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌ను త్వరలోనే ఇంటికి సాగనంపుతారని, ప్రజలు బీజేపీకే మద్దతు ఇస్తారని వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు.

J.P.Nadda: ప్రజలు త్వరలోనే కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తారు: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా

J.P.Nadda: తెలంగాణ ప్రజలు త్వరలోనే సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తారని, ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తారని వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా. శనివారం సాయంత్రం హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా జేపీ నద్దా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

NEET 2022: లోదుస్తులు తొలగించిన విద్యార్థులకు మళ్లీ ‘నీట్’ పరీక్ష.. ఎన్‪టీఏ నిర్ణయం

‘‘ఉద్యమాల ఓరుగల్లు గడ్డపై అడుగుపెట్టడం అదృష్టంగా భావిస్తున్నా. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నా. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనే అవకాశం దక్కింది. కేసీఆర్ అంధకారంలోకి నెట్టిన తెలంగాణలో వెలుగులు తెచ్చే ఉద్దేశంతోనే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. రెండో విడత యాత్ర సందర్భంగా కూడా ఆయనను అరెస్టు చేశారు. రానున్న రోజుల్లో కేసీఆర్‌ను ప్రజలు ఇంటికి పంపిస్తారు. ఈసారి ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వడం ఖాయం. ఎమ్ఐఎమ్ పార్టీకి భయపడే కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. బీజేపీ అంటే కేసీఆర్ భయపడుతున్నారు.

Jharkhand political crisis: ఝార్ఖండ్‌లో మొదలైన రిసార్ట్ రాజకీయం.. రహస్య ప్రదేశానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు

దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్‌కు చుక్కలు చూపించాం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తాం. బండి సంజయ్ యాత్ర, సభకు కేసీఆర్ అనేక అడ్డంకులు సృష్టించారు. ఆయన ఒక నయా నిజాంలా వ్యవహరిస్తున్నారు. చివరి ఉస్మాన్ అలీఖాన్ కూడా కేసీఆర్‌లాంటి ఆంక్షలే విధించేవారు. జల్ జీవన్ మిషన్ కింద తెలంగాణకు మూడున్నర వేల కోట్లు ఇస్తే, రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామని వరంగల్ జైలును కూల్చారు. ఇంకా ఆస్పత్రి నిర్మించలేదు. టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే బీజేపీ లక్ష్యం. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారు.

CWC to meet tomorrow: గులాంనబీ ఆజాద్ ఎఫెక్ట్.. రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ.. అధ్యక్ష ఎన్నికపై చర్చ

ఈ ప్రాజెక్టు ఆయనకు ఏటీఎంలాగా మారింది. రూ.40 వేల కోట్ల ప్రాజెక్టును, రూ.1.40 లక్షల కోట్లకు మార్చారంటేనే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది. అవినీతికి పాల్పడ్డందుకే కేసీఆర్‌లో భయం పట్టుకుంది. తెలంగాణకు మద్దతు ఇచ్చింది బీజేపీ మాత్రమే’’ అని జేపీ నద్దా వ్యాఖ్యానించారు.