CWC to meet tomorrow: గులాంనబీ ఆజాద్ ఎఫెక్ట్.. రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ.. అధ్యక్ష ఎన్నికపై చర్చ

కాంగ్రెస్ పార్టీ అత్యవసరంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆదివారం మధ్యాహ్నం ఈ మీటింగ్ జరుగుతుంది. కొత్త అధ్యక్షుడి ఎన్నికపై ఈ సమావేశంలో చర్చిస్తారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను నిర్ణయిస్తారు.

CWC to meet tomorrow: గులాంనబీ ఆజాద్ ఎఫెక్ట్.. రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ.. అధ్యక్ష ఎన్నికపై చర్చ

CWC to meet tomorrow: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఐదు దశాబ్దాలపాటు పార్టీలో కొనసాగిన ఆయన పార్టీని వీడి వెళ్లేముందు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది పార్టీకి కూడా ఇబ్బందికర పరిణామమే. అందుకే ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడి, పార్టీని గాడినపెట్టే అంశంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది.

NEET 2022: లోదుస్తులు తొలగించిన విద్యార్థులకు మళ్లీ ‘నీట్’ పరీక్ష.. ఎన్‪టీఏ నిర్ణయం

దీనిలో భాగంగా ఆదివారం అత్యవసరంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మీటింగ్ నిర్వహించనుంది. పార్టీకి సంబంధించిన కీలక విభాగం సీడబ్ల్యూసీ. రేపు మధ్యాహ్నం మూడున్నరకు వర్చువల్‌గా ఈ మీటింగ్ జరగబోతుంది. సోనియా గాంధీ సహా పలువురు నేతలు ఇటీవలే కరోనా బారిన పడి, కోలుకున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో వర్చువల్‌గా ఈ మీటింగ్ జరగబోతుంది. దీనిలో ప్రధానంగా అధ్యక్ష ఎన్నికపైనే చర్చిస్తారు. అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌ను నిర్ణయించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని వచ్చే సెప్టెంబర్ 20 లోపు ఎన్నుకోవాలని కాంగ్రెస్ పార్టీ గత ఏడాది అక్టోబర్‌లోనే నిర్ణయించింది. దీని ప్రకారం.. ఈ ఆగష్టు 21-సెప్టెంబర్ 20 లోపు అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాలి.

Jharkhand political crisis: ఝార్ఖండ్‌లో మొదలైన రిసార్ట్ రాజకీయం.. రహస్య ప్రదేశానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు

అయితే, ఈ విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ షెడ్యూల్ ప్రకారం అధ్యక్ష ఎన్నిక వచ్చే నెల 20 లోపు పూర్తి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇక అధ్యక్ష పదవి ఎవరు చేపడుతారు అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. అయితే, చాలా మంది మాత్రం రాహుల్ గాంధీనే తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరుతున్నారు. దేశవ్యాప్తంగా అంతటి ఇమేజ్ ఉన్న నేతలెవరూ కాంగ్రెస్ పార్టీలో లేరని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.