NEET 2022: లోదుస్తులు తొలగించిన విద్యార్థులకు మళ్లీ ‘నీట్’ పరీక్ష.. ఎన్‪టీఏ నిర్ణయం

నీట్ పరీక్ష సందర్భంగా కేరళలోని కొందరు విద్యార్థినిలకు నిర్వాహకులు లో దుస్తులు తీయించిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు లో దుస్తులు తీసేసి, పరీక్ష రాశారు. అయితే, దీనివల్ల మానసిక ఒత్తిడికి గురైన వాళ్లు పరీక్ష సరిగ్గా రాయలేకపోయారు. దీంతో వచ్చే నెలలో వారికి తిరిగి పరీక్ష నిర్వహించబోతున్నారు.

NEET 2022: లోదుస్తులు తొలగించిన విద్యార్థులకు మళ్లీ ‘నీట్’ పరీక్ష.. ఎన్‪టీఏ నిర్ణయం

NEET 2022: గత నెలలో జరిగిన నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష సందర్భంగా కేరళకు చెందిన కొందరు విద్యార్థినుల లో దుస్తులు తీయించిన సంగతి తెలిసిందే. ఈ అంశం ఆ విద్యార్థినులపై తీవ్ర ప్రభావం చూపిందని, దీంతో సరిగ్గా పరీక్ష రాయలేకపోయారని తల్లిదండ్రులు ఆరోపించారు.

Bihar: బిహార్‌లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు.. రూ.4 కోట్ల నగదు స్వాధీనం

వారి కోరిక మేరకు ఆ విద్యార్థినిలకు తిరిగి నీట్ పరీక్ష నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‪టీఏ) అనుమతించింది. వచ్చే నెల 4న ఈ పరీక్ష జరగనుంది. గత నెల 17న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరిగింది. ఈ సందర్భంగా కేరళలోని ఒక సెంటర్‌లో పరీక్షకు హాజరైన వంద మందికి పైగా విద్యార్థినులను లో దుస్తులు తీసేయాలి అని అక్కడి నిర్వాహకులు ఆదేశించారు. దీంతో విద్యార్థినులు లో దుస్తులు తీసేసి పరీక్ష రాశారు. దీనివల్ల వాళ్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, దీంతో పరీక్ష సరిగ్గా రాయలేకపోయారని విద్యార్థినిల తల్లిందండ్రులు ఆరోపించారు. ఈ అంశం బయటకు రావడంతో పెద్ద వివాదం చెలరేగింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్‪టీఏ స్పందించింది. తాము అలాంటి సూచనేమీ చేయలేదని చెప్పింది.

Uttar Pradesh: నదిలో పడ్డ ట్రాక్టర్, ట్రాలీ.. 10 మంది రైతుల గల్లంతు

ఇందుకు బాధ్యులైన ఏడుగురు అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వాళ్లు బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ అంశంపై విచారణ జరిపేందుకు త్రిసభ్య కమిటీని ఎన్‪టీఏ ఏర్పాటు చేసింది. విద్యార్థినులు ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిపై విచారణ జరిపి నివేదిక అందజేసింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ఈ ఘటన జరిగిన కొల్లాం జిల్లాలోని బాధిత విద్యార్థినిలకు తిరిగి పరీక్ష నిర్వహించాలని ఎన్‪టీఏ నిర్ణయించింది. దీంతో వచ్చే నెల 4న వారికి నీట్ పరీక్ష జరగబోతుంది.