Uttar Pradesh: నదిలో పడ్డ ట్రాక్టర్, ట్రాలీ.. 10 మంది రైతుల గల్లంతు

20 మందికిపైగా రైతులతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 13 మంది ఈదుకుంటూ, ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డారు. మరో పది మంది వరకు గల్లంతయ్యారు.

Uttar Pradesh: నదిలో పడ్డ ట్రాక్టర్, ట్రాలీ.. 10 మంది రైతుల గల్లంతు

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. 20 మందికిపైగా రైతులతో వెళ్తున్న ట్రాక్టర్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో పది మంది వరకు గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. హర్దోయ్ జిల్లాలోని పాలి ప్రాంతంలో, గర్రా నది బ్రడ్జిపై శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది.

Vande Bharat: వందేభారత్ రెండో ట్రయల్ రన్ పూర్తి.. 180 కి.మీ వేగంతో ప్రయాణం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక రైతులంతా దగ్గర్లో ఉన్న మార్కెట్లో దోసకాయ పంట అమ్ముకుని, ఉదయం తమ స్వస్థలాలకు బయలుదేరారు. ట్రాక్టర్ ట్రాలీలో అందరూ కూర్చుని వస్తున్నారు. అయితే, బ్రిడ్జిపైకి రాగానే ట్రాక్టర్ ముందు చక్రం ఊడిపోయింది. దీంతో ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ సమయంలో ట్రాక్టర్‌‌లో 20 మందికిపైగా రైతులు ఉన్నట్లు సమాచారం. నీళ్లలో పడ్డ తర్వాత కొందరు కూలీలు ఆ నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. 13 మంది వరకు బయటపడ్డారు.

Bihar: బిహార్‌లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు.. రూ.4 కోట్ల నగదు స్వాధీనం

మిగతా పది మంది వరకు గల్లంతై ఉంటారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో ఆ రైతు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ట్రాక్టర్ కూడా చాలా దూరం నీటిలో కొట్టుకుపోయింది.